ఆ బిల్లులపై సంతకం చేయవద్దు…

వ్య‌వ‌సాయ బిల్లుల‌ను ఆమోదించ‌వ‌ద్దని రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌కు వినతిపత్రంను అందించారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత గులాంన‌బీ ఆజాద్ నేతృత్వంలో రాష్ట్రపతిని కలిశారు.

ఆ బిల్లులపై సంతకం చేయవద్దు...
Follow us

|

Updated on: Sep 23, 2020 | 6:25 PM

వ్యవసాయ బిల్లులపై పోరాటంను విపక్షం మరింత హీట్ పెంచింది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అన్ని మార్గాలను ఉపయోగించుకుంటోంది. వ్య‌వ‌సాయ బిల్లుల‌ను ఆమోదించ‌వ‌ద్దని రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌కు వినతిపత్రంను అందించారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత గులాంన‌బీ ఆజాద్ నేతృత్వంలో రాష్ట్రపతిని కలిశారు. ఆజాద్ స‌హా మ‌రికొంత మంది విపక్ష‌నేత‌లు రాష్ట్రపతిని క‌లిసి కేంద్ర వైఖ‌రికి నిర‌స‌న‌గా ఓ లేఖ‌ను స‌మ‌ర్పించారు.

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఇవాళ కూడా లోక్‌సభ కార్యకలాపాలను బహిష్కరించింది విపక్షం. ఓటింగ్‌ నిర్వహించకుండానే బిల్లులను ఆమోదించారని పార్లమెంట్‌ ఆవరణలో నిరసన కొనసాగించారు. గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు విపక్ష ఎంపీలు ర్యాలీ తీశారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు కూడా వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు.