టీటీడీ గుడ్ న్యూస్.. వారికి 90 రోజుల్లోపు ఎప్పుడైనా ఉచిత దర్శనం.!

భక్తులకు టీటీడీ మరో గుడ్ న్యూస్ అందించింది. ఆన్‌లైన్‌ కల్యాణోత్సవంలో పాల్గొనేవారికి శ్రీవారిని దర్శించుకునే ఛాన్స్ కల్పించింది. వారు టికెట్ బుక్ చేసుకున్న రోజు నుంచి 90 రోజుల్లోపు...

  • Ravi Kiran
  • Publish Date - 9:58 am, Sat, 12 September 20
టీటీడీ గుడ్ న్యూస్.. వారికి 90 రోజుల్లోపు ఎప్పుడైనా ఉచిత దర్శనం.!

Srivari Kalyanotsavam: భక్తులకు టీటీడీ మరో గుడ్ న్యూస్ అందించింది. ఆన్‌లైన్‌ కల్యాణోత్సవంలో పాల్గొనేవారికి శ్రీవారిని దర్శించుకునే ఛాన్స్ కల్పించింది. వారు టికెట్ బుక్ చేసుకున్న రోజు నుంచి 90 రోజుల్లోపు ఎప్పుడైనా కూడా సుపథం ప్రవేశమార్గం నుంచి ఉచితంగా శ్రీవారిని దర్శించుకోవచ్చునని తెలిపింది. ఈ అవకాశాన్ని భక్తులు తప్పనిసరిగా వినియోగించుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.

కాగా, కరోనా నేపథ్యంలో టీటీడీ ఏర్పాటు చేసిన ఆన్‌లైన్‌ కల్యాణోత్సవ సేవలకు భక్తుల నుంచి మంచి స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. ఆగష్టు 7వ తేదీన ఈ సేవలను మొదలుపెట్టగా.. అప్పటి నుంచి ఈ నెల 7 వరకు దాదాపుగా 8,330 టికెట్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇక ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవ సేవలు ప్రారంభమవుతాయి.

Also Read: 

ఏపీ విద్యార్ధులకు గమనిక.. ఎంసెట్ హాల్‌ టికెట్స్‌ వచ్చేశాయి..

”అంతర్వేది ఘటనలో చంద్రబాబు ప్రమేయం ఉంది”

ఫస్ట్ వీక్ ఎలిమినేషన్స్.. ఆ ముగ్గురిలో ఒకరు ఔట్..!