ఇక ప్రీ స్కూల్స్ గా అంగన్‌వాడీలు.. ఆన్‌లైన్‌లో బోధన..

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అంగన్‌వాడీ కేంద్రాలు ప్రీ స్కూల్స్ గా మారనున్నాయి. ఆన్‌లైన్‌లోనే పాఠాలు నేర్పనున్నారు. చిన్నారుల్లో ప్రేరణకు

  • Updated On - 12:27 pm, Fri, 17 July 20 Edited By:
ఇక ప్రీ స్కూల్స్ గా అంగన్‌వాడీలు.. ఆన్‌లైన్‌లో బోధన..

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అంగన్‌వాడీ కేంద్రాలు ప్రీ స్కూల్స్ గా మారనున్నాయి. ఆన్‌లైన్‌లోనే పాఠాలు నేర్పనున్నారు. చిన్నారుల్లో ప్రేరణకు కొత్త పాఠ్యాంశాలు అందుబాటులోకి రానున్నాయి. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత అంగన్‌వాడీల బోధనను ఆన్‌లైన్‌లో సాగించేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది.

తెలంగాణలో 149 ఐసీడీఎస్‌(సమగ్ర శిశు అభివృద్ధి పథకం) ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలున్నా యి. ఇక పై ఈ కేంద్రాలు పూర్వ ప్రాథమిక పాఠశాలలు (ప్రీ స్కూల్స్) గా మారనున్నాయి. కేంద్రం నిబంధనల ప్రకారం ఈ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగించాలని నిర్ణయించింది.

కొత్త పాఠ్యాంశాల్లో భాగంగా.. స్థానిక పరిస్థితుల నేపథ్యంలో కథలు, పాటలు, ఆటలు, మానసిక అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం రూపొందించింది. ఇవన్నీ వీడియోల రూపంలో తయారు చేసింది. ఇవి అంగన్‌వాడీల్లో అందుబాటులో ఉంటాయి. ఈ వీడియోలను రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంచారు.

Also Read: యూజీసీ మార్గదర్శకాల మేరకు.. పరీక్షల నిర్వహణకే మొగ్గు..