ఉల్లి దొంగలొస్తున్నారు జాగ్రత్త..!

బంగారం, వెండి, నగదు..ఇలా విలువైన వస్తువులు చోరీ అవడం కామన్‌. కానీ ఉల్లిపాయలను దొంగిలించడం మీరెప్పుడైనా చూశారా..? ఏంటీ ఉల్లిపాయల దొంగతనమా..అని ఆశ్చర్యపోతున్నారా..కానీ ఇది నిజం. ఇప్పుడు లేటెస్ట్‌ ట్రెండ్‌ అదే. ఎందుకంటే ఉల్లి ధర కొండెక్కి కూర్చుంది. కేజీ ఆనియన్స్‌ రేటు వంద రూపాయలకు పైమాటే. దీంతో బంగారాన్ని వదిలేసి ఉల్లిపాయల వెంటబడుతున్నారు దొంగలు. తమిళనాడులో 350 కిలోల ఉల్లిపాయలను దోచుకెళ్లారు.పెరంబలూర్‌లోని కూతానూరు గ్రామంలో ముత్తుకృష్ణన్‌ అనే ఓ 40 ఏళ్ల రైతు 350 కిలోల […]

ఉల్లి దొంగలొస్తున్నారు జాగ్రత్త..!
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 04, 2019 | 5:24 PM

బంగారం, వెండి, నగదు..ఇలా విలువైన వస్తువులు చోరీ అవడం కామన్‌. కానీ ఉల్లిపాయలను దొంగిలించడం మీరెప్పుడైనా చూశారా..? ఏంటీ ఉల్లిపాయల దొంగతనమా..అని ఆశ్చర్యపోతున్నారా..కానీ ఇది నిజం. ఇప్పుడు లేటెస్ట్‌ ట్రెండ్‌ అదే. ఎందుకంటే ఉల్లి ధర కొండెక్కి కూర్చుంది. కేజీ ఆనియన్స్‌ రేటు వంద రూపాయలకు పైమాటే.

దీంతో బంగారాన్ని వదిలేసి ఉల్లిపాయల వెంటబడుతున్నారు దొంగలు. తమిళనాడులో 350 కిలోల ఉల్లిపాయలను దోచుకెళ్లారు.పెరంబలూర్‌లోని కూతానూరు గ్రామంలో ముత్తుకృష్ణన్‌ అనే ఓ 40 ఏళ్ల రైతు 350 కిలోల ఉల్లిపాయలను నిల్వ చేశారు. సాగుతో పాటు మార్కెట్‌కు తరలించాలనే ఉద్దేశ్యంతో స్టోర్‌చేశాడు. ఐతే ఇటీవల కురుస్తున్న కుండపోత వర్షాలతో కాస్త ఆలస్యమైంది. ఇది గమనించిన దొంగలు వాటిపై కన్నేశారు. సమయం చూసి దోచుకెళ్లారు. దీంతో లబోదిబోమంటున్న ఆ రైతు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  దీన్నిబట్టి బంగారం, వెండి లాంటి కాస్ట్లీ ఐటమ్స్‌ లిస్ట్‌లో చేరిపోయిందని..ఇక ఉల్లి మాటమర్చిపోవలసిందేనంటున్నారు సామాన్యులు.