తీసుకున్న అప్పు తిరిగి ఇస్తానంటూ పిలిచి..!

తీసుకున్న అప్పు తిరిగి ఇస్తానంటూ పిలిచి స్నేహితుడితో కలిసి ఆత్యాచారానికి యత్నించాడు. కీచకుల నుంచి తప్పించుకున్న మహిళ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

తీసుకున్న అప్పు తిరిగి ఇస్తానంటూ పిలిచి..!
Balaraju Goud

| Edited By: Pardhasaradhi Peri

Jun 12, 2020 | 5:30 PM

రక్షణగా ఉండాల్సిన రక్షణభటుడే రాక్షసుడిలా మారాడు. తీసుకున్న అప్పు తిరిగి ఇస్తానంటూ పిలిచి స్నేహితుడితో కలిసి ఆత్యాచారానికి యత్నించాడు. కీచకుల నుంచి తప్పించుకున్న మహిళ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌లో వెంకట రాజేష్‌ అనే కానిస్టేబుల్‌ రైటర్‌గా పనిచేస్తున్నాడు. ఒంగోలు దిబ్బలరోడ్డుకు చెందిన ఓ మహిళతో అతనికి పరిచయం ఏర్పడింది. రాజేష్ ఇదే అదునుగా ఆమె నుంచి రూ.35 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పుడు నగ్నచిత్రాలు, వీడియోలు తీశాడు. తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించమని కోరితే ఆ చిత్రాలు చూపించి బెదిరింపులకు దిగాడు. జూన్ 8 వ తేదీన అప్పు చెల్లిస్తానని తన స్నేహితుడు విశ్రాంత సైనికోద్యోగి నల్లూరి సుధాకర్‌ ఇంటికి మహిళను పిలిచాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసేందుకు సుధాకర్‌ను రాజేష్‌ ప్రేరేపించాడు. బాధితురాలు తప్పించుకొని వెళ్లగా సుధాకర్‌, వీరి స్నేహితుడు దొంగా హరి బెదిరింపులకు దిగారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు, అతని స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu