గుడ్ న్యూస్: పరీక్ష లేకుండానే.. ఓఎన్‌జీసీలో 4,182 అప్రెంటీస్‌ ఖాళీల భర్తీ!

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. చాలా కంపెనీలు లేఆఫ్ ప్రకటించాయి. ఈ క్రమంలో ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఓఎన్‌జీసీ)

గుడ్ న్యూస్: పరీక్ష లేకుండానే.. ఓఎన్‌జీసీలో 4,182 అప్రెంటీస్‌ ఖాళీల భర్తీ!
Follow us

| Edited By:

Updated on: Jul 29, 2020 | 4:55 PM

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. చాలా కంపెనీలు లేఆఫ్ ప్రకటించాయి. ఈ క్రమంలో ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఓఎన్‌జీసీ) దేశవ్యాప్తంగా మొత్తం 4,182 అప్రెంటీస్‌ ఖాళీలను భర్తీ చేస్తోంది. డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా విద్యార్థులు అందుకు అర్హులు. అర్హులు ఆయా ఖాళీలను బట్టి దరఖాస్తు చేసుకోవచ్చు. 4182 అప్రెంటీస్‌ పోస్టులు ఉండగా వాటిలో ఏపీ కి చెందినవి 366 ఖాళీలు ఉన్నాయి. వీటి భర్తీ కోసం ప్రకటన విడుదలైంది.

అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత ను బట్టి ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆగస్టు 17, 2020 దరఖాస్తుకు చివరితేది. అభ్యర్థుల వయసు ఆగస్టు 17, 2020 నాటికి 18-24 ఏళ్ల మధ్య ఉండాలి. పూర్తి వివరాలకు ఈ లింక్ https://www.ongcindia.com/wps/wcm/connect/en/career/recruitment-notice/ క్లిక్ చేయండి. అర్హుల జాబితాను ఆగస్టు 24న విడుదల చేయనున్నారు.

Read More:

కరోనా ప్రభావం తగ్గగానే రచ్చబండ.. గ్రామాల్లో పర్యటన

కరోనా ఎఫెక్ట్: శ్రావణమాసం పెళ్లిళ్లు.. అన్నీ ‘పరిమితమే’!