ఠారెత్తిస్తున్న టర్కీ ఉల్లి.. ఒకటి రూ.60.. రెండు రూ.120!

దేశవ్యాప్తంగా మండిపోతున్న ఉల్లి ధరలకు సామాన్య ప్రజలు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఒకానొక దశలో కేజీ రూ.200 పలికిన ఉల్లి.. ఇప్పుడు రూ.120-150 మధ్య సాగుతోంది. ఈ ఉల్లి ఘాటుకు ఏకంగా హోటళ్లలో ఉల్లి దోశ మెనూ నుంచి తీస్తే.. వంటిల్లుల్లో ఉల్లి అసలు కనిపించట్లేదు. అయితే దేశం నుంచి ఉల్లి ఎగుమతులపై కూడా కేంద్రం నిషేదం విధించడంతో కొంతకాలంగా ఉల్లి దిగుమతులు తగ్గాయన్న సంగతి తెలిసిందే. ఇక ఆ నిషేదాన్ని పాక్షికంగా సడలించడంతో.. టర్కీ, ఈజిప్ట్ తదితర […]

ఠారెత్తిస్తున్న టర్కీ ఉల్లి.. ఒకటి రూ.60.. రెండు రూ.120!
Follow us

|

Updated on: Dec 19, 2019 | 1:01 PM

దేశవ్యాప్తంగా మండిపోతున్న ఉల్లి ధరలకు సామాన్య ప్రజలు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఒకానొక దశలో కేజీ రూ.200 పలికిన ఉల్లి.. ఇప్పుడు రూ.120-150 మధ్య సాగుతోంది. ఈ ఉల్లి ఘాటుకు ఏకంగా హోటళ్లలో ఉల్లి దోశ మెనూ నుంచి తీస్తే.. వంటిల్లుల్లో ఉల్లి అసలు కనిపించట్లేదు. అయితే దేశం నుంచి ఉల్లి ఎగుమతులపై కూడా కేంద్రం నిషేదం విధించడంతో కొంతకాలంగా ఉల్లి దిగుమతులు తగ్గాయన్న సంగతి తెలిసిందే. ఇక ఆ నిషేదాన్ని పాక్షికంగా సడలించడంతో.. టర్కీ, ఈజిప్ట్ తదితర దేశాల నుంచి సుమారు 17,090 టన్నుల ఉల్లి దిగుమతులు జరుగుతున్నాయి. దీంతో కాస్త ఉపశమనం లభించిందని అనుకుంటే.. కొత్త తలనొప్పులు మొదలయ్యాయట.

పంజాబ్, ఛత్తీస్గడ్, ఢిల్లీ వంటి నగరాలు టర్కీ నుంచి ఉల్లిని దిగుమతులు చేసుకుంటున్నాయి. సుమారు 60కిపైగా టన్నుల ఉల్లిని తెప్పించినట్లు తెలుస్తోంది. ధరలు తగ్గుతాయని అందరూ అనుకుంటే.. ఇక్కడే కొత్త చిక్కు వచ్చిపడిందని వ్యాపారాలు లబోదిబోమంటున్నారు. టర్కీ నుంచి దిగుమతైన ఉల్లి.. కేజీలో రెండంటే రెండు పాయలే తూగడం గమనార్హం. ఇక వాటి ధర కిలో రూ. 120 నుంచి రూ. 130ల మధ్య పలుకుతోంది. కొన్ని అయితే ఇంకా ఎక్కువ బరువు ఉన్నాయని సమాచారం. ఈ క్రమంలోనే ఒక్కో ఉల్లిపాయ రూ.60 పలకటంతో ప్రజలు షాక్‌కు గురవుతున్నారు. వాటిని చూసి జనాల గుండె గుబేల్ మంటోంది.