అస్సాంలో గడ్డ కట్టుకుపోయిన వెయ్యి డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్, కోల్డ్ స్టోరేజీలో సాంకేతిక సమస్యే అంటున్న అధికారులు

అస్సాం లోని కచార్ జిల్లాలో గల సిల్చార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో వ్యాక్సిన్ స్టోర్ యూనిట్ లో గల వెయ్యి డోసుల కోవీషీల్డ్ వ్యాక్సిన్ పాడైపోయింది..

  • Umakanth Rao
  • Publish Date - 12:18 pm, Wed, 20 January 21
అస్సాంలో గడ్డ కట్టుకుపోయిన వెయ్యి డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్, కోల్డ్ స్టోరేజీలో సాంకేతిక సమస్యే అంటున్న అధికారులు

అస్సాం లోని కచార్ జిల్లాలో గల సిల్చార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో వ్యాక్సిన్ స్టోర్ యూనిట్ లో గల వెయ్యి డోసుల కోవీషీల్డ్ వ్యాక్సిన్ పాడైపోయింది. వంద వయల్స్ లోని ఈ టీకామందును సబ్ జీరో టెంపరేచర్స్ లో నిల్వ చేశారు. నిజానికి 2.8 డిగ్రీల  సెల్సియస్  ఉష్ణోగ్రత మధ్య  దీన్ని స్టోర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఆసుపత్రిలోని స్టోరేజీ యూనిట్ లో ఉష్ణోగ్రతలు జీరో స్థాయికి పడిపోయాయి. ఈ వ్యాక్సిన్ కొంతవరకు మాత్రమే గడ్డకట్టుకుపోయిందని అధికారి ఒకరు తెలిపారు. ఐ ఎల్ ఆర్ ఫ్రిజ్ లో ఏదో సాంకేతిక సమస్య తలెత్తి ఉండవచ్ఛునని ఆయన చెప్పారు. సాధారణంగా ఉష్ణోగ్రత తగ్గినప్పుడు ఐ ఎల్ ఆర్ మెషిన్ మెసేజ్ ఇస్తుందని, కానీ ఈ వ్యాక్సినేటర్ కి ఎలాంటి మెసేజ్ అందలేదన్నారు. రాత్రంతా ఈ టీకామందు ఇందులోనే ఉండిపోవడంవల్ల ఇలా జరిగి ఉండవచ్ఛు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఎంతో ఖర్చుతో అత్యంత దూర ప్రాంతం నుంచి అందిన ప్రాణ రక్షణ టీకామందును జాగ్రత్తగా నిల్వ చేయాల్సి ఉండగా అధికారుల నిర్లక్ష్యం కారణంగా వెయ్యి డోసుల వ్యాక్సిన్ పాడైపోవడం విడ్డూరంగా ఉంది.

Also Read:

Paul Dinakaran: చెన్నైలో ఐటీ దాడులు.. క్రైస్తవ ప్రచారకుడు పాల్ దినకరన్ ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు..

దాదాపు మూడు నెలలుగా అదృశ్యమైన అలీబాబా సంస్థ చీఫ్ జాక్ మా తొలిసారిగా కనబడ్డారు, కోవిడ్ కారణంగానే మిస్సింగ్ ?

Minissha Lamba: బంధం బలంగా లేకుంటే విడిపోవడం మంచిది.. అది పెద్ద నేరమేమి కాదంటున్న ప్రముఖ నటి..