కరోనా వేళ.. కాల్పుల మోతతో దద్దరిల్లిన దండకారణ్యం..

కరోనా వేళ.. కాల్పుల మోతతో దద్దరిల్లిన దండకారణ్యం..

ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా అంతా కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తోంటే.. మన దేశం మాత్రం ఓ వైపు సరిహద్దుల్లో ఉగ్రవాదులతో.. మరోవైపు దేశం లోపల మావోయిస్టులతో యుద్ధం చేస్తోంది. తాజాగా ఛత్తీస్‌ఘడ్ దండకారణ్యం అడవుల్లో శనివారం ఉదయం కాల్పుల మోత మోగింది. మావోయిస్టులకు, పోలీసులకు మధ్య భీకర పోరు జరిగింది. ఈ ఘటనలో ఓ సబ్ ఇన్సెక్టర్‌ ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. మాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్ధోని గ్రామ సమీప […]

TV9 Telugu Digital Desk

| Edited By:

May 09, 2020 | 10:15 AM

ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా అంతా కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తోంటే.. మన దేశం మాత్రం ఓ వైపు సరిహద్దుల్లో ఉగ్రవాదులతో.. మరోవైపు దేశం లోపల మావోయిస్టులతో యుద్ధం చేస్తోంది. తాజాగా ఛత్తీస్‌ఘడ్ దండకారణ్యం అడవుల్లో శనివారం ఉదయం కాల్పుల మోత మోగింది. మావోయిస్టులకు, పోలీసులకు మధ్య భీకర పోరు జరిగింది. ఈ ఘటనలో ఓ సబ్ ఇన్సెక్టర్‌ ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. మాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్ధోని గ్రామ సమీప అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.

పోలీసులు కూంబింగ్ చేపడుతున్న సమయంలో మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. మావోయిస్టులపైకి ఎదురుకాల్పులు చేపట్టారు. దీంతో నలుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మ‌‌ృతి చెందారు. కాగా.. మావోలు జరిపిన కాల్పుల్లో ఓ సబ్ ఇన్‌స్పెక్టర్‌ తీవ్రంగా గాయపడ్డారు.. అయితే ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగానే ప్రాణాలు విడిచారు. సంఘటనా స్థలంలో ఏకే -47 రైఫిల్, ఒక ఎస్ఎల్ఆర్, రెండు 315 బోర్ రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu