F3 Movie Update: ‘ఎఫ్‌-3’లో మరో హీరో..? గెస్ట్‌ రోల్‌లో కనిపించనున్న మెగా హీరో..

One More Hero In F3: అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్‌-2 చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ కలిసి నటించిన ఈ మల్టీస్టారర్‌ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది...

F3 Movie Update: 'ఎఫ్‌-3'లో మరో హీరో..? గెస్ట్‌ రోల్‌లో కనిపించనున్న మెగా హీరో..
Follow us

|

Updated on: Jan 19, 2021 | 10:51 AM

One More Hero In F3: అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్‌-2 చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ కలిసి నటించిన ఈ మల్టీస్టారర్‌ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద నవ్వుల జల్లుతో పాటు కలెక్షన్ల జల్లును కూడా కురిపించింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న వరుణ్‌ తేజ్‌ సినిమా షూటింగ్‌లో తిరిగి పాల్గొన్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఎఫ్‌-3 సినిమాలో మరో మెగా హీరో నటించనున్నాడనేది సదరు వార్త సారాంశం. ఆ హీరో ఎవరో కాదు.. సాయి ధరమ్‌ తేజ్‌. ఇక ‘ఎఫ్-2’లో క్లైమాక్స్‌లో వచ్చే అనసూయ, వెన్నెల కిషోర్‌ పాత్రలు సినిమాకే హైలెట్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఎఫ్‌-3లో కూడా సాయి ధరమ్‌ తేజ్‌ పాత్ర ఇలా క్లైమాక్స్‌లో వస్తుందని చర్చ జరుగుతోంది. ప్రీక్లైమాక్స్‌లో వచ్చే ఈ పాత్రను దర్శకుడు చాలా ఫన్నీగా రూపొందించాడని సమాచారం. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి . ఇక ఇప్పటికే విడుదల చేసిన ‘ఎఫ్ 3’ కాన్సెప్ట్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేసిందని చెప్పాలి.

Also Read: Ravi Teja: క్రాక్‌తో ట్రాక్‌లోకి వచ్చిన మాస్ మాహారాజా.. వరుస కడుతున్న పలువురు నిర్మాతలు..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.