నగరంలో కూలిన పాత ఇంటి గోడ.. అలర్టయిన జీహెచ్‌ఎంసీ

హైదరాబాద్ సైదాబాద్‌లో ప్రాంతంలో  ఓ పాత ఇంటి  గోడ కూలి ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. సైదాబాద్ పూసలబస్తీలో గల ఓ ఇంటికి సంబంధించిన పురాతన గోడ కూలిపోయింది. దీంతో ఇంట్లో నివసిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఓ వ్యక్తి తలకు తీవ్రగాయం కావడంతో ఉస్మానియా హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలుచేపట్టారు. వర్షాకాలంలో ఇటువంటి పాత గోడలు కూలిపోయే ప్రమాదముందని జీహెచ్‌ఎంసీ […]

నగరంలో కూలిన పాత ఇంటి గోడ.. అలర్టయిన జీహెచ్‌ఎంసీ
Follow us

| Edited By:

Updated on: Sep 14, 2019 | 3:50 PM

హైదరాబాద్ సైదాబాద్‌లో ప్రాంతంలో  ఓ పాత ఇంటి  గోడ కూలి ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. సైదాబాద్ పూసలబస్తీలో గల ఓ ఇంటికి సంబంధించిన పురాతన గోడ కూలిపోయింది. దీంతో ఇంట్లో నివసిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఓ వ్యక్తి తలకు తీవ్రగాయం కావడంతో ఉస్మానియా హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలుచేపట్టారు.

వర్షాకాలంలో ఇటువంటి పాత గోడలు కూలిపోయే ప్రమాదముందని జీహెచ్‌ఎంసీ ఇప్పటికే నగరంలో పలు పాత భవనాలకు నోటీసులు జారీ చేసింది. గతంలో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్యలు కూడా చేపట్టారు. ఇటువంటి భవనాలు పాతబస్తీలోనే అధికంగా ఉండటంతో వాటిలో కొన్నిటిని కూల్చివేశారు. అయినా తాజా ఘటనతో మరోసారి జీహెచ్ఎంసీ అధికారులు పాత భవనాలు, కూలిపోడానికి సిద్ధంగా ఉన్న ఇళ్లపై దృష్టి సారించారు. కొంతమంది ఇంటి యజమానులు తమ ఇళ్లను ఖాళీ చేసేందుకు ఇష్టపడకపోవడంతో ప్రమాదాలు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే వర్షాలతో బాగా చెమ్మగిల్లిన గోడలతో ఆయా ఇళ్లల్లో నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, జీహెచ్ఎంసీ హెచ్చరికల్ని పాటించి ఖాళీ చేయాలని అధికారులు విఙ్ఞప్తి చేస్తున్నారు.