ఉలిక్కిపడ్డ హైదరాబాద్ గడ్డి అన్నారం ఫ్రూట్‌ మార్కెట్‌.!, సీసీ టీవీల్లో రికార్డయిన్ మర్డర్ సీన్స్

హైదరాబాద్‌ చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గడ్డి అన్నారం ఫ్రూట్‌ మార్కెట్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది... కారణం.. పాత నేరస్తుడు...

  • Venkata Narayana
  • Publish Date - 2:55 pm, Sat, 26 December 20
ఉలిక్కిపడ్డ హైదరాబాద్ గడ్డి అన్నారం ఫ్రూట్‌ మార్కెట్‌.!,  సీసీ టీవీల్లో రికార్డయిన్ మర్డర్ సీన్స్

హైదరాబాద్‌ చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గడ్డి అన్నారం ఫ్రూట్‌ మార్కెట్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది… కారణం.. పాత నేరస్తుడు హత్య..రాజు అనే పాత నేరస్థుడుని గొంతుకోసి హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. మల్లాపూర్ కు చెందిన రాజు గత నెలలో పండ్ల దొంగతనం కేసులో అరెస్ట్‌ అయి ఈ మధ్యనే బెయిల్‌పై బయటకు వచ్చాడు.. ఏం జరిగిందో ఏమో కానీ తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు..ఈ కిరాతం అంతా సీసీ కెమెరాలో రికార్డయింది. ఫ్రూట్ మార్కెట్ లలో తరచు పండ్లను దొంగిలించేవాడని, అదే క్రమంలో బాగా మద్యం సేవించి, నిన్న రాత్రి కూడా ఫ్రూట్ మార్కెట్ లో పనిచేసే మరో కూలి మహ్మద్ ఫిరోజ్ తో గొడవపడి, నన్నే అరెస్టు చేపిస్తావా.. నీ అంతు చూస్తానని రాజు బెదిరించినట్లు తెలుస్తోంది. రాజు బెదిరింపులకు దిగడంతో నిన్న రాత్రి చైతన్య పురి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఫిరోజ్. మార్కెట్‌లో ఉన్న సీసీ కెమెరా లో మాత్రం మొత్తం ఏడుగురు వ్యక్తులు ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.