కరోనా వ్యాక్సిన్ వారందరికీ ఉచితం.. కేంద్రం గైడ్‌లైన్స్‌కు ప్రకారమే పంపిణీకి ఏర్పాట్లుః ఒడిశా మంత్రి

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలో ఒడిశా సర్కార్ నిర్ణయం తీసుకుంది. కరోనా కష్టకాలంలో బాధితులకు సేవ చేసిన హెల్త్ వర్కర్లకు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తామని ఒడిశా ప్రభుత్వం గురువారం ప్రకటించింది.

కరోనా వ్యాక్సిన్ వారందరికీ ఉచితం.. కేంద్రం గైడ్‌లైన్స్‌కు ప్రకారమే పంపిణీకి ఏర్పాట్లుః ఒడిశా మంత్రి
Follow us

|

Updated on: Dec 17, 2020 | 8:51 PM

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలో ఒడిశా సర్కార్ నిర్ణయం తీసుకుంది. కరోనా కష్టకాలంలో బాధితులకు సేవ చేసిన హెల్త్ వర్కర్లకు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తామని ఒడిశా ప్రభుత్వం గురువారం ప్రకటించింది. వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి.. తొలి దశలో వైద్యులు, వైద్య సిబ్బంది, వయసు పైబడిన వారికి కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించనున్నట్లు ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నబకిశోర్ దాస్ తెలిపారు. రెండో దశలో.. మున్సిపాలిటీ, ఎలక్ట్రిసిటీ, తాగు నీటి సరఫరా సిబ్బంది, పబ్లిక్ హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్‌ను అందించాల్సిందిగా కేంద్రాన్ని కోరనున్నట్లు ఆయన వెల్లడించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ జనవరి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.

కాగా, దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం చురుకుగా సాగుతోంది. ఇందులో భాగంగా తొలి దశలో 30 కోట్ల మందికి వ్యాక్సిన్‌ను అందించాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. తదనుగుణంగానే రాష్ట్రంలో వ్యాక్సిన్ పంపిణీ జరగనుందని దాస్ స్పష్టం చేశారు. మొదటి దశలో ఒడిశాలో 3.2 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. కరోనా పంపిణీ కోసం ఒడిశా వ్యాప్తంగా 29,276 కేంద్రాలను గుర్తించినట్లు మంత్రి కిషోర్ దాస్ వెల్లడించారు.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!