సీన్ రివర్స్: అక్కడ విద్యార్థులే టీచర్లు.. మార్కులు వేసి..

సీన్ రివర్స్: అక్కడ విద్యార్థులే టీచర్లు.. మార్కులు వేసి..

ఎక్కడైనా టీచర్లు చెప్పిన మాటలు విద్యార్థులు వింటారు. కానీ ఇప్పుడు సీన్ కాస్తా రివర్స్ అయింది. విద్యార్థులే ఏకంగా ఉపాధ్యాయులకు మార్కులు వేయనున్నారు. వారు ఇచ్చే మార్కులు, ఫీడ్‌బ్యాక్ బట్టే ఉపాధ్యాయులకు ప్రమోషన్స్, వేతనాలు పెంపు ఉండనుంది. ఈ వినూత్న నిర్ణయానికి ఒడిశా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉపాధ్యాయులు తమ బోధనను మెరుగుపరుచుకోవడానికి.. పాఠశాలలో బోధనా ప్రమాణాలు పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒడిశా విద్యాశాఖ మంత్రి సమీర్ రంజన్ దాస్ తెలిపారు. మొత్తం 10 పాయింట్లకు […]

Ravi Kiran

|

Aug 31, 2019 | 11:22 AM

ఎక్కడైనా టీచర్లు చెప్పిన మాటలు విద్యార్థులు వింటారు. కానీ ఇప్పుడు సీన్ కాస్తా రివర్స్ అయింది. విద్యార్థులే ఏకంగా ఉపాధ్యాయులకు మార్కులు వేయనున్నారు. వారు ఇచ్చే మార్కులు, ఫీడ్‌బ్యాక్ బట్టే ఉపాధ్యాయులకు ప్రమోషన్స్, వేతనాలు పెంపు ఉండనుంది. ఈ వినూత్న నిర్ణయానికి ఒడిశా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉపాధ్యాయులు తమ బోధనను మెరుగుపరుచుకోవడానికి.. పాఠశాలలో బోధనా ప్రమాణాలు పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒడిశా విద్యాశాఖ మంత్రి సమీర్ రంజన్ దాస్ తెలిపారు.

మొత్తం 10 పాయింట్లకు గానూ విద్యార్థులు రేటింగ్ ఇస్తారని.. దాని బట్టే ఉపాధ్యాయుల పనితీరుపై ప్రభుత్వానికి ఓ అంచనా వస్తుంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఒడిశా పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో రేటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది.

విద్యాశాఖ మంత్రి సమీర్ రంజన్ దాస్ మాట్లాడుతూ ‘ఇకపై విద్యార్థుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోనున్నాం. ప్రతి తరగతిలోనూ ఓ రిజిస్టర్ ఏర్పాటు చేస్తాం. అందులో ప్రతి టీచర్ తాము తరగతి గదిలోకి వచ్చిన సమయం.. బయటి వెళ్లే సమయంతో పాటు ఆ రోజు చెప్పిన పాఠాలు.. హాజరైన విద్యార్థుల సంఖ్యను కూడా రాయాల్సి ఉంటుందని వివరించారు. ఇక క్లాస్ పూర్తయిన తర్వాత స్టూడెంట్స్ నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటామని.. ఉపాధ్యాయులు చెప్పిన పాఠం అర్ధం కాకపోతే అందులో నోట్ చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. దీని ద్వారా టీచర్లు తమ బోధనా ప్రమాణాలను మరింత మెరుగుపర్చుకోవచ్చని మంత్రి అన్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu