వావ్ !యూట్యూబ్ ఛానెల్ పెట్టిన ఒడిశా కూలీ… లక్షల సొమ్ము అతని జేబులోకి..

ఒడిశాలో ఓ కూలీ తన రోజువారీ కూలీ జీవితానికి ఇప్పుడు స్వస్తి చెప్పాడు. కేవలం తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా లక్షలు సంపాదిస్తున్నాడు. గత ఏడాది తొలి లాక్ డౌన్ అతని జీవితాన్నే మార్చేసింది. ఇసాక్ ముందా అనే 35 ఏళ్ళ ఇతని లైఫ్ లోకి తొంగి చూస్తే...ఒకప్పుడు లేబరర్ అయిన ఇసాక్..

వావ్ !యూట్యూబ్ ఛానెల్ పెట్టిన ఒడిశా కూలీ... లక్షల సొమ్ము అతని జేబులోకి..
Odisha Labourer Is Earning Lakhs From His You Tube Channel,odisha,labourer Isak Munda,you Tube Channel,lakhs,videos

ఒడిశాలో ఓ కూలీ తన రోజువారీ కూలీ జీవితానికి ఇప్పుడు స్వస్తి చెప్పాడు. కేవలం తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా లక్షలు సంపాదిస్తున్నాడు. గత ఏడాది తొలి లాక్ డౌన్ అతని జీవితాన్నే మార్చేసింది. ఇసాక్ ముందా అనే 35 ఏళ్ళ ఇతని లైఫ్ లోకి తొంగి చూస్తే…ఒకప్పుడు లేబరర్ అయిన ఇసాక్.. చాలీచాలని సొమ్ముతో తన కుటుంబాన్ని నెట్టుకు వచ్చేవాడు.. కరోనా వైరస్ లాక్ డౌన్ తో పనులు లేక…. చేత డబ్బులు లేక అల్లాడిపోయాడు. అయితే ఆ సమయంలో తన ఫ్రెండ్ నుంచి 3 వేల రూపాయలు అప్పు తీసుకుని దాంతో ఓ చిన్న స్మార్ట్ ఫోన్ కొని వీడియోలు తయారు చేస్తూ వచ్చాడు. లాక్ డౌన్ కాలంలో అతడికి రోజల్లా ఇదే పని ! ఏం చేయాలో తోచక ఒడిశా లోని తమ దైనందిన జీవితాలనే థీమ్ గా తీసుకుని వీటిని రూపొందిస్తు వచ్చాడు మెల్లగా ఇతని వీడొయోలకు ఆదరణ పెరుగుతూ వచ్చింది. తమ రాష్ట్రంలో లభించే చవకైన, అరుదైన పుట్టగొడుగులతో చేసిన ఆహారాన్ని తింటూ యితడు చేసిన వీడియోలు ఎంతోమందిని ఆకర్షించాయి. తన మొదటి వీడియోను సుమారు 5 లక్షల మంది చూసారని ఇసాక్ ముందా తెలిపాడు.

ఇది పోస్ట్ అయిన 3 నెలల తరువాత తొలిసారిగా అతని బ్యాంకు ఖాతాలోకి 37 వేల రూపాయలు జమ అయ్యాయట/ మరో మూడు నెలల తరువాత ఏకంగా 5 లక్షలు క్రెడిట్ అయినట్టు ఇసాక్ చెప్పాడు. తన విలేజ్ లైఫ్ ని, ఫుడ్ హ్యాబిట్స్ ని, తమ సంస్కృతిని హైలైట్ చేస్తూ 250 కి పైగా వీడియోలను రూపొందించినట్టు ఈయన తెలిపాడు. తన ఛానల్ లి 7 లక్షల వరకు సబ్ స్కైబర్లు ఉన్నట్టు చెప్పాడు. తాను ఏడో తరగతి వరకే చదివానని..ఇండియాలోని వారే కాక విదేశాల్లోని వారు కూడా తన వీడియోలు చూస్తుంటారని వెల్లడించాడు. చివరకు అరుదుగా దొరికే తాటాకులతో తన భార్య చేసిన మ్యాట్ ను కూడా తన వీడియోలో చూపానని పేర్కొన్నాడు.

మరిన్ని ఇక్కడ చూడండి : సోషల్ మీడియాలో ‘గృహలక్ష్మీ’ నటి మరో రచ్చ.. ముఖ్యమంత్రి పై షాకింగ్ కామెంట్స్..(వీడియో):actor kasturi shankar video.

 కరోనా కన్నా .. మాకు చేపలే ఎక్కువ?తమిళనాడు లో కోవిడ్ నిబంధలు ఉల్లంఘన వైరల్ అవుతున్న వీడియో..:Tamil Nadu Video.

 ఒట్టి చేతులతో వెనక్కి ఎందుకు.. చెప్పులు ఎత్తికెళ్తే పోలా..? దొంగతనంకు దర్జాగా లిఫ్ట్ లో వచ్చిన దొంగ..(వీడియో):Viral Video.

 ఫుట్ బాల్ పిచ్‌లో గ‌ర్ల్‌ఫ్రెండ్‌కి పెళ్లి ప్రపోజల్..!హోరెత్తిన స్టేడియం..వైరల్ అవుతున్న వీడియో..:Proposal on pitch video.

Click on your DTH Provider to Add TV9 Telugu