తొమ్మిదో జట్టు చేరికతో ఐపీఎల్ మరింత సూపర్

తొమ్మిదో జట్టు చేరికతో ఐపీఎల్ మరింత సూపర్

ఈ సారి ఐపీఎల్ మెగా టోర్నమెంట్‌లో తొమ్మిది జట్ల మధ్య హోరాహోరీ పోరును చూడొచ్చంటూ క్రికెట్ ప్రేమికులు డిసైడ్ అయ్యారు కూడా. వచ్చే ఏడాది వేసవి సీజన్‌లోనే ఐపీఎల్-2021ను నిర్వహించడం దాదాపు ఖాయం కావడం వల్ల ఇంకో అయిదారు నెలల్లో మళ్లీ ఐపీఎల్ మెగా టోర్నమెంట్‌ను చూడటానికి ఉవ్విళ్లూరుతున్నారు.

Sanjay Kasula

|

Nov 12, 2020 | 3:53 PM

ఐపీఎల్-14 సీజన్‌కు కొత్తగా తొమ్మిదో టీమ్ రాబోతుందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. కరోనా కారణంగా ఎక్కడో దూరంగా యూఏఈలో మ్యాచులు జరగడంతో అంతగా కిక్ ఇవ్వలేదు. వచ్చే మరో ఆరు నెలల్లో ఈ సీజన్ మన దేశంలో జరుగనుంది. వీటి చూసి ఎంజాయ్ చేద్దామని అభిమానులు డిసైడ్ అయ్యారు.

ఈ సారి ఐపీఎల్ మెగా టోర్నమెంట్‌లో తొమ్మిది జట్ల మధ్య హోరాహోరీ పోరును చూడొచ్చంటూ క్రికెట్ ప్రేమికులు డిసైడ్ అయ్యారు కూడా. వచ్చే ఏడాది వేసవి సీజన్‌లోనే ఐపీఎల్-2021ను నిర్వహించడం దాదాపు ఖాయం కావడం వల్ల ఇంకో అయిదారు నెలల్లో మళ్లీ ఐపీఎల్ మెగా టోర్నమెంట్‌ను చూడటానికి ఉవ్విళ్లూరుతున్నారు.

వచ్చే ఏడాది ఐపీఎల్ ఇండియాలో ఉంటుందని  బిసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ గతంలో తెలిపిన విషయం తెలిసిందే. అది కూడా ఏప్రిల్, మే నెలల్లోనే జరగనుందని పేర్కొన్నారు. ఆ రకంగా చూస్తే ఇంకా సమయం చాలా తక్కువ ఉంది.

అయితే బీసీసీఐ ఈ సారి సీజన్ గురించి అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.  కొత్త ఫ్రాంచైజీ రేస్‌లోకి దిగబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.  కొత్త ఫ్రాంచైజీ వస్తే ఈ సారి వేలం మరింత రసవత్తరంగా మారుతుంది. ఈ మేరకు ఇప్పటికే ఫ్రాంచైజీలకు బీసీసీఐ నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. మాములుగా అయితే ప్రతీ సీజన్ వేలం డిసెంబర్‌లోనే జరుగుతుంది, కానీ ఈ సారి 2021 ఆరంభంలో వేలం నిర్వహించనున్నారట.

కొత్త జట్టును ఐపీఎల్-2021లో చేర్చితే.. మ్యాచ్‌ల కూడా భారీగా సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం ఎనిమిది ఐపీఎల్ జట్లు 14 చొప్పున లీగ్ మ్యాచ్‌ల చొప్పున ఆడుతున్నాయి. ఇక కొత్త జట్ట చేరికతో ఆ సంఖ్య మరింత పెరగనుంది. కొత్తగా తొమ్మిదో జట్టు చేరికతో  ఈ నెంబర్ 60 నుంచి 74కు చేరుకుంటుంది. దీనికి అనుగుణంగా బీసీసీఐ ఏర్పాట్లను చేయాల్సి ఉంటుంది. సమయం తక్కువగా ఉన్నందున.. ఈ సారి ఆ రిస్క్‌ను తీసుకోకూడదనే అనుకుంటోంది. అందుకే కొత్త ఫ్రాంఛైజీ కోసం దాఖలు చేయాల్సిన టెండర్ల ప్రక్రియను కాస్త ఆలస్యంగా చేపట్టడానికి ప్లాన్ చేస్తోంది. దీపావళి తరువాతే కొత్త ఫ్రాంఛైజీ టెండర్లను ఆహ్వానిస్తుందని భావిస్తున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu