ఎన్ఎస్ఏ చీఫ్ అజిత్ దోవల్ కుమారుడికి కాంగ్రెస్ నేత జైరాం రమేష్ క్షమాపణ, అంగీకరించిన వివేక్, ఏమిటా కేసు ?

జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఎ) చీఫ్ అజిత్ దోవల్ కుమారుడు వివేక్ దోవల్ కి కాంగ్రెస్ నేత జైరాం రమేష్ క్షమాపణలు చెప్పడంతో ఓ పరువునష్టం కేసు క్లోజయింది. వివేక్ ఆధ్వర్యంలో నడుస్తున్న..

ఎన్ఎస్ఏ చీఫ్ అజిత్ దోవల్ కుమారుడికి కాంగ్రెస్ నేత జైరాం రమేష్ క్షమాపణ, అంగీకరించిన వివేక్, ఏమిటా కేసు ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 19, 2020 | 4:29 PM

జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఎ) చీఫ్ అజిత్ దోవల్ కుమారుడు వివేక్ దోవల్ కి కాంగ్రెస్ నేత జైరాం రమేష్ క్షమాపణలు చెప్పడంతో ఓ పరువునష్టం కేసు క్లోజయింది. వివేక్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ సంస్థపై కారవాన్ మేగజైన్ ఓ కథనాన్ని ప్రచురించడం, దానిపై జైరాం రమేష్…. వివేక్ మీద ఆరోపణలు గుప్పించడంతో వివేక్ ఆగ్రహించి ఆ మేగజైన్ ఎడిటర్ పరేష్ నాథ్ పైన , జైరాం రమేష్ పైన ఢిల్లీ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. అలాగే ఆ పత్రిక రిపోర్టర్  కౌశల్ ష్రాఫ్ పై కూడా అయన కేసు పెట్టారు. వీరి చర్యలు తన పరువుకు భంగం కలిగించాయన్నారు. వివేక్ దోవల్ నిర్వహిస్తున్న బిజినెస్ కార్యకలాపాలపై ‘డీ-కంపెనీస్’పేరిట కారవాన్ పత్రిక లోగడ ఓ ఆర్టికల్ ను ప్రచురించింది. వివరాల్లోకి వెళ్తే.. వివేక్, ఆయన కుటుంబ సభ్యుల నేతృత్వంలో నడుస్తున్న జీఎన్వై ఏషియా ఫండ్ బిజినెస్ వెంచర్ లో అక్రమాలు జరిగాయని, ప్రమోటర్లు అవినీతికి పాల్పడ్డారని జైరాం రమేష్ 2019 జనవరి 17 న ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేశారు. కారవాన్ మేగజైన్ లో ప్రచురితమైన ఆర్టికల్ నేపథ్యంలో ఈ ఆరోపణలు చేస్తున్నానన్నారు. కానీ ఆ తరువాత వాస్తవాలు గ్రహించి ఆత్మపరిశీలన చేసుకున్నానని, మీపట్ల, మీ కుటుంబం పట్ల అనుచితంగా మాట్లాడానని రమేష్ సారీ చెప్పారు.

నా వ్యాఖ్యలు మిమ్మల్ని బాధించి ఉంటే అపాలజీ చెబుతున్నా అన్నారు. దీన్ని తాను అంగీకరిస్తునట్టు వివేక్ దోవల్ తెలిపినప్పటికీ కారవాన్ మేగజైన్ పైన, సంబంధిత రిపోర్టర్ పైన పెట్టిన కేసును మాత్రం ఆయన ఉపసంహరించుకోలేదు. దీంతో వీరిపై కేసు కొనసాగుతుందని అడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సచిన్ గుప్తా స్పష్టం చేశారు. ఏమైనా, జాతీయ భద్రతా సలహాదారు కుమారునిపై ఆరోపణలు రావడం మాత్రం గమనార్హం.