ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై నిమిషాల్లో ‘ఈ పాన్‌’!

శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) పొందడం సులభతరం చేస్తూ ఆదాయపు పన్ను విభాగం సరికొత్త ప్రణాళికను అమలుపరుస్తోంది. ఆన్‌లైన్ ద్వారా సత్వరం ‘ఈ పాన్‌ కార్డు’ పొందే విధానాన్ని ఈ నెల నుంచి అందుబాటులోకి తేవాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రెవెన్యూ శాఖ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే గురువారం వెల్లడించారు. ఆధార్‌ వివరాలు సమర్పించడం ద్వారా ఆన్‌లైన్‌లో సత్వరం పాన్‌కార్డు పొందేందుకు కొత్త విధానాన్ని తీసుకురావాలని కేంద్రం బడ్జెట్‌లో ప్రతిపాదించింది. దీంతో ఈ […]

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై నిమిషాల్లో 'ఈ పాన్‌'!

శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) పొందడం సులభతరం చేస్తూ ఆదాయపు పన్ను విభాగం సరికొత్త ప్రణాళికను అమలుపరుస్తోంది. ఆన్‌లైన్ ద్వారా సత్వరం ‘ఈ పాన్‌ కార్డు’ పొందే విధానాన్ని ఈ నెల నుంచి అందుబాటులోకి తేవాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రెవెన్యూ శాఖ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే గురువారం వెల్లడించారు. ఆధార్‌ వివరాలు సమర్పించడం ద్వారా ఆన్‌లైన్‌లో సత్వరం పాన్‌కార్డు పొందేందుకు కొత్త విధానాన్ని తీసుకురావాలని కేంద్రం బడ్జెట్‌లో ప్రతిపాదించింది. దీంతో ఈ నెల నుంచి ఆ విధానాన్ని తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించినట్లు చెప్పారు.

ఈ-పాన్‌ పొందాలనుకునేవారు ఆదాయ పన్ను(ఐటీ) విభాగం వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆధార్‌నంబర్‌ నమోదు చేయాలి. దీంతో ఆధార్‌తో అనుసంధానం అయిన రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ ద్వారా వివరాలు పరిశీలన పూర్తయిన తక్షణమే పాన్‌ నంబర్‌ కేటాయించబడుతుంది. అనంతరం ఆన్‌లైన్‌ ఈ-పాన్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు’ అని ఆయన తెలిపారు. పన్ను చెల్లింపుదారులు ఐటీ శాఖకు దరఖాస్తు ఫారమ్ సమర్పించడంలో ఈ విధానం ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు.

శాశ్వత ఖాతా సంఖ్య (పాన్)తో ఆధార్‌ను లింక్‌ చేసుకోవడాన్ని చివరి తేదీ 2020, మార్చి 31గా ప్రభుత్వం నిర్ణయించింది.

Published On - 5:10 am, Fri, 7 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu