ప్రక్షాళన దిశగా తెలంగాణ నీటిపారుదల శాఖ.. కొత్తగా 628 ఇంజినీర్‌ పోస్టులు

నీటిపారుదల శాఖకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. ఆ శాఖ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. నీటిపారుదల శాఖ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ప్రాజెక్టుల నుంచి కాలువల వరకు నిర్వహణకు వీలుగా క్షేత్రస్థాయి సిబ్బంది సంఖ్యను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రక్షాళన దిశగా తెలంగాణ నీటిపారుదల శాఖ.. కొత్తగా 628 ఇంజినీర్‌ పోస్టులు
Follow us

|

Updated on: Sep 07, 2020 | 3:50 PM

నీటిపారుదల శాఖకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. ఆ శాఖ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. నీటిపారుదల శాఖ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ప్రాజెక్టుల నుంచి కాలువల వరకు నిర్వహణకు వీలుగా క్షేత్రస్థాయి సిబ్బంది సంఖ్యను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఏఈ, జేఈల పరిధిలో మార్పులు తీసుకొస్తోంది. ఒక వర్క్‌ఇన్‌స్పెక్టర్‌, ఇద్దరి కంటే ఎక్కువ మంది లష్కర్లను కాంట్రాక్ట్ పద్ధతిలో నియామక ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది.

కొత్త విధానంలో భాగంగా నీటిపారుదల శాఖ పేరును జలవనరుల శాఖగా మార్పుచేయాలని కేసీఆర్ ప్రభుత్వం ఫ్లాన్ చేస్తోంది. దీంతో పాటు ఇంజినీర్ల పోస్టులు మరో 628 పెంచాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు ఆరు నెలలుగా నీటిపారుదల శాఖ ప్రక్షాళన ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు అనుగుణంగా అధికారులు, ఇంజినీర్లు ముసాయిదాకు తుదిరూపు ఇచ్చినట్లు తెలిసింది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో జరిగిన సమీక్షలో మరికొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. నీటిపారుదల కొత్త ముసాయిదాకు ఆర్థిక శాఖ అనుమతి లభిస్తే ఈ శాసన సభ సమావేశాల్లోనే చట్టం చేయనున్నారు.

రాష్ట్రంలో కొత్తగా ఎత్తిపోతల పథకాలు అందుబాటులోకి రావడం, ప్రాజెక్టుల కింద సాగు విస్తీర్ణం పెరగడంతో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా శాఖను పునర్‌వ్యవస్థీకరించాలని సీఎం కేైసీఆర్ సంకల్పించారు. క్షేత్ర స్థాయిలో యంత్రాంగాన్ని బలోపేతం చేయడంపైనా దృష్టిసారించారు. భారీ, మధ్య, చిన్న తరహా..ఇలా అన్ని విభాగాలనూ ఒకే గొడుకు కిందకి తెస్తున్నారు. జిల్లా స్థాయిలో నీటి పారుదల అభివృద్ధి సంస్థతోపాటు, అన్ని విభాగాలను సీఈ పరిధిలోకి తీసుకురానున్నారు. ఎస్‌ఈలు, ఈఈలతోపాటు క్షేత్రస్థాయి ఇంజినీర్లందరూ సీఈ పర్యవేక్షణ కింద విధులు నిర్వర్తించేలా వ్యవస్థలో మార్పులు చేయనున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా 31 మంది సీఈలు ఉండాలని తొలుత భావించినప్పటికీ, ఆ సంఖ్యను 28కే పరిమితం చేయాలనే నిర్ణయించినట్లు సమాచారం. మొత్తంగా ఇంజినీరింగ్‌ సంబంధ పోస్టులు మరో 628 పెంచాలని ఉన్నతాధికారులు ముసాయిదా సిద్ధం చేశారు.

ఇక, రాష్ట్ర వ్యాప్తంగా 6,660 మంది లష్కర్లు అవసరమని (జీవో నెం.29 ప్రకారం) గతంలో పలు ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయి. తక్షణ అవసరాలకు నాలుగు వేల మంది అవసరమని ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ప్రభుత్వానికి నివేదించారు. నిజానికి ప్రస్తుతం రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో 1600 పోస్టుల మంజూరు ఉండగా, 1300 మంది మాత్రమే పనిచేస్తున్నారు. తదనుగుణంగా క్షేత్రస్థాయి సిబ్బంది పెంచి ప్రాజెక్టులు, నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం.

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..