ఆ సింగర్‌కు సల్మాన్ అదిరిపోయే గిఫ్ట్.. ప్రచారం వట్టిదేనట..

ఆ సింగర్‌కు సల్మాన్ అదిరిపోయే గిఫ్ట్.. ప్రచారం వట్టిదేనట..

ఒక్క పాటతో అడుక్కునే స్థాయి నుంచి సెన్సేషన్ సింగర్‌గా మారిన పశ్చిమబెంగాల్‌కు చెందిన రణు మొండల్‌ పెద్ద పెద్ద సినిమాల్లో పాట పాడే ఛాన్స్ కొట్టేశారు. తాజాగా ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఆమెకు లక్షల విలువ చేసే ఇల్లు కొనిచ్చారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు సల్మాన్ లేటెస్ట్ ప్రాజెక్టు దబాంగ్-3లోనూ సింగర్‌గా అవకాశం ఇచ్చారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై సల్మాన్ సన్నిహితుడొకరు స్పందించారు. ఈ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 28, 2019 | 5:21 PM

ఒక్క పాటతో అడుక్కునే స్థాయి నుంచి సెన్సేషన్ సింగర్‌గా మారిన పశ్చిమబెంగాల్‌కు చెందిన రణు మొండల్‌ పెద్ద పెద్ద సినిమాల్లో పాట పాడే ఛాన్స్ కొట్టేశారు. తాజాగా ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఆమెకు లక్షల విలువ చేసే ఇల్లు కొనిచ్చారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు సల్మాన్ లేటెస్ట్ ప్రాజెక్టు దబాంగ్-3లోనూ సింగర్‌గా అవకాశం ఇచ్చారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై సల్మాన్ సన్నిహితుడొకరు స్పందించారు. ఈ ప్రచారంలో నిజం లేదని ఆయన చెప్పారు. ఇదంతా కేవలం వదంతులు మాత్రమేనని ఆయన వెల్లడించారు.

లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఆలపించిన ఏక్ ప్యార్ కా నగ్‌మా హే పాటను.. పశ్చిమ బెంగాల్‌‌కు చెందిన రణు మండల్ అనే యాచకురాలు అచ్చం అలాగే పాడటంతో ఒక్కరాత్రిలో ఆమె సెన్సేషన్‌గా మారిపోయిన విషయం తెలిసిందే. ఆ తరువాత బాలీవుడ్ కంపోజర్ హిమేష్ రేష్మియా ఆమె టాలెంట్ గుర్తించి.. ఆయన లేటెస్ట్ ఆల్బమ్ తేరి మేరీ కహానీలో రణు మండల్‌‌కు పాట పాడే అవకాశం ఇచ్చారు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఇదే క్రమంలో సల్మాన్ కూడా ఆ సింగర్‌కు సాయం చేశారని పుకార్లు వచ్చాయి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu