యాదవులకు గుడ్ న్యూస్..’గొల్ల మండపం’ నో ఛేంజ్..!

తిరుమలలో వెంకన్న ప్రధాన ఆలయం ముందు ఉన్న గొల్ల మండపం తొలగింపు విషయంలో వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ ప్రతిపాదనపై యాదవ సంఘాలు భగ్గుమంటున్నాయి. దీనిపై టీటీడీ  వెర్షన్ మాత్రం వేరేలా ఉంది. సదరు మండపం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో..అనుకోని ప్రమాదం సంభవించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని చెప్తూ వచ్చింది. అయితే ఉభయ రాష్ట్రాల్లోని గొల్ల, కురమ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోన్న నేపథ్యంలో టీటీడీ బోర్డు వెనుకంజ వేసింది. తాజాగా గొల్ల మండలం […]

యాదవులకు గుడ్ న్యూస్..'గొల్ల మండపం' నో ఛేంజ్..!
Follow us

|

Updated on: Dec 28, 2019 | 1:23 PM

తిరుమలలో వెంకన్న ప్రధాన ఆలయం ముందు ఉన్న గొల్ల మండపం తొలగింపు విషయంలో వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ ప్రతిపాదనపై యాదవ సంఘాలు భగ్గుమంటున్నాయి. దీనిపై టీటీడీ  వెర్షన్ మాత్రం వేరేలా ఉంది. సదరు మండపం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో..అనుకోని ప్రమాదం సంభవించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని చెప్తూ వచ్చింది. అయితే ఉభయ రాష్ట్రాల్లోని గొల్ల, కురమ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోన్న నేపథ్యంలో టీటీడీ బోర్డు వెనుకంజ వేసింది.

తాజాగా గొల్ల మండలం మార్పు విషయాన్ని టీటీటీ బోర్డు సభ్యుడు, అధికార పార్టీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి ఖండించారు. దేశవ్యాప్తంగా ఉన్న యాదవులు మనోభావాలతో ముడిపడివున్న గొల్లమండపం యథాస్థానంలోనే ఉంటుందని, ఇంజనీరింగ్ నిపుణుల సలహాలు తీసుకుని కేవలం మరమ్మత్తులు చేయిస్తామని  తెలిపారు. ఎన్నో వందల సంవత్సారలకు చెందిన నిర్మాణం, ఒక వర్గానికి సంబంధించిన సెంటిమెంట్ అంశం కావడంతో దాన్ని తప్పకుండా అక్కడే ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇక అమరావతి‌లో ఇన్‌సైడ్ ట్రేడింగ్‌పై పక్కా ఆధారాలున్నాయని చెప్పిన పార్థసారథి..గత ప్రభుత్వం రాజధానిని కేవలం ఆధాయవనరుగా చూసిందని పేర్కొన్నారు.