ఏపీ : ఆ 4 జిల్లాల్లో లక్షణాలు లేకపోయినా‌ కరోనా పాజిటివ్‌

ఏపీలో కరోనా తీవ్ర‌త‌ కొనసాగుతోంది. రోజూ భారీగానే పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. కొన్ని జిల్లాల్లో వైర‌స్ ప్ర‌భావం అధికంగా ఉంది.

ఏపీ : ఆ 4 జిల్లాల్లో లక్షణాలు లేకపోయినా‌ కరోనా పాజిటివ్‌
Follow us

|

Updated on: Aug 24, 2020 | 8:05 AM

ఏపీలో కరోనా తీవ్ర‌త‌ కొనసాగుతోంది. రోజూ భారీగానే పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. కొన్ని జిల్లాల్లో వైర‌స్ ప్ర‌భావం అధికంగా ఉంది. ఈ వైరస్ జ‌నాల‌పై విభిన్న రూపాల్లో ప్ర‌భావం చూపుతోంది. ఎలాంటి సింట‌మ్స్‌ లేకపోయినా చాలామందికి పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. కరోనా లక్షణాలైన జ్వరం, జ‌లుబు, దగ్గు లేకుండానే కోవిడ్ సోకిన‌ట్టు తేలుతోంది. దీనికి సంబంధించి సీరో సర్వైలెన్స్‌ సర్వేలో పలు ఇంట్ర‌స్టింగ్ విషయాలు బయటపడ్డాయి.

కృష్ణా, తూర్పుగోదావరి, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో సీరో సర్వైలెన్స్‌ సర్వేను వైద్యఆరోగ్య శాఖ చేప‌ట్టింది. ఈ నాలుగు జిల్లాల్లో నమోదైన కేసుల్లో సింట‌మ్స్ లేకుండానే ఎక్కువమందికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. అనంతపురం జిల్లాలో 99.5 శాతం, కృష్ణా జిల్లాలో 99.4 శాతం, నెల్లూరు జిల్లాలో 96.1 శాతం, తూర్పుగోదావరి జిల్లాలో 92.8 శాతం మందికి ఎటువంటి లక్షణాల్లేకుండానే వైరస్ సోకింది. ముఖ్యంగా కృష్ణా జిల్లా విష‌యానికి వ‌స్తే… ఎక్కువ జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో నిర్వహించిన సర్వేలో 22.3 శాతం మందికి కరోనా వ‌చ్చివెళ్లిన‌ట్లు కూడా తెలియ‌దు. ఆ 22.3 శాతం మందిలో యాంటీబాడీస్ డెవ‌ల‌ప్‌ చెందినట్లు నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

రాష్ట్రంలో ఎలాంటి సింట‌మ్స్ లేకుండా కోవిడ్ సోకిన‌ వారిని పది రోజుల పాటు హోం క్వారంటైన్‌, ఐసోలేషన్ సెంట‌ర్ల‌లో ఉంచుతున్నారు అధికారులు. పది రోజుల్లో వ్యాధి తీవ్ర‌త పెరిగి.. జ్వరంగానీ, దగ్గుగానీ వస్తే వాటికి మెడిసిన్ ఇస్తారు. లేదంటే స‌రైన‌ పోషకాహారం తీసుకుంటే సరిపోతుంది. 11వ రోజు నుంచి వారు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ బయట తిరగొచ్చు. ఇక వారి ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవ‌కాశం ఉండ‌దు. మళ్లీ టెస్టులు కూడా అవసరం లేదట. ఇలాంటి వారు ఎక్కువ మంది హోం క్వారంటైన్‌లో ఉంటారని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్ స్పెష‌ల్ ఆఫిస‌ర్ డాక్టర్‌ కె. ప్రభాకర్‌ రెడ్డి చెప్పారు.

Also Read :

పాస్‌పోర్టు వెరిఫికేషన్ ప్రైవేటు సంస్థ‌ల‌ చేతికి !

వైఎస్సార్‌ ఆసరా‌ నగదుపై ఆంక్షలు లేవు, ఉత్త‌ర్వుల్లో తేల్చి చెప్పిన ప్ర‌భుత్వం

ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో