ఆ 5 లక్షల మందికి ‘రైతు బంద్’.. తెలంగాణ సర్కార్ నిర్ణయం..

వివిధ కారణాలతో బ్యాంక్ అకౌంట్ నెంబర్, వివరాలను ఇవ్వాలని దాదాపు 5 లక్షల మంది లబ్దిదారుల అకౌంట్లలోకి 'రైతుబంధు' డబ్బులు జమ చేయడం కుదరదని తెలంగాణ వ్యవసాయశాఖ వెల్లడించింది.

ఆ 5 లక్షల మందికి 'రైతు బంద్'.. తెలంగాణ సర్కార్ నిర్ణయం..
Follow us

|

Updated on: Jun 29, 2020 | 8:33 AM

వివిధ కారణాలతో బ్యాంక్ అకౌంట్ నెంబర్, వివరాలను ఇవ్వని దాదాపు 5 లక్షల మంది లబ్దిదారుల అకౌంట్లలోకి ‘రైతుబంధు’ డబ్బులు జమ చేయడం కుదరదని తెలంగాణ వ్యవసాయశాఖ వెల్లడించింది. అలాగే ఆరు నెలల పాటు ఎలాంటి బ్యాంకు లావాదేవీలు జరపని 26 వేల మంది అకౌంట్లలోకి కూడా రైతు బంధు సొమ్ము జమ కాలేదని రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. అన్ని నెలల పాటు బ్యాంక్ ఖాతా ద్వారా ఎలాంటి లావాదేవీలు జరపకపోవడంతో.. అది క్లోజ్ అయినట్లుగా బ్యాంకుల కంప్యూటర్లలో చూపుతోందని.. దీనితో ‘రైతు బంధు’ సొమ్మును బ్యాంకులు వ్యవసాయశాఖకు తిరిగి పంపించారన్నారు.

మరోవైపు కొందరు భూముల యజమానులు వారి స్వస్థలంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో, ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో సెటిల్ కావడంతో వారిని సంప్రదించేందుకు ఫోన్ నెంబర్లు అందుబాటులో లేవని వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈఓ) ఒకరు చెప్పారు. కాగా, ఫోన్ నెంబర్, వివరాలు తప్పుగా ఉన్న రైతుల ఇళ్లకు వెళ్లి వారిని ఖాతాను తిరిగి పని చేసేలా చూసుకోమని, లేదా కొత్త ఖాతా తెరిచి పూర్తి వివరాలను ఆన్లైన్‌లో నమోదు చేయాలని వ్యవసాయశాఖ ఏఈఓలను ఆదేశించింది.

ఇది చదవండి: ఏపీ ప్రయాణాలపై ఆంక్షలు.. రాత్రి 7 గంటల వరకు అనుమతి..!