పార్టీ మారేది లేదు టీవీ9తో సాధినేని యామిని

తాను ఏపార్టీలోకి వెళ్లడం లేదంటున్నారు టీడీపీ ఫైర్ బ్రాండ్‌ సాధినేని యామిని. తన పదునైన మాటలతో గత ప్రభుత్వ హయాంలో ఆమె అధికార ప్రతినిధిగా ప్రతిపక్ష పార్టీపై మాటలు సంధించారు. ఆమె గత కొంతకాలంగా మౌనంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె పార్టీ మారుతున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. వీటన్నికి చెక్ పెడుతూ ఆమె టీవీ 9కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆస్తక్తికర అంశాలను ప్రస్తవించారు. తాను ఎందుకు మౌనంగా ఉండాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. […]

పార్టీ మారేది లేదు టీవీ9తో సాధినేని యామిని
Follow us

| Edited By:

Updated on: Sep 04, 2019 | 8:56 PM

తాను ఏపార్టీలోకి వెళ్లడం లేదంటున్నారు టీడీపీ ఫైర్ బ్రాండ్‌ సాధినేని యామిని. తన పదునైన మాటలతో గత ప్రభుత్వ హయాంలో ఆమె అధికార ప్రతినిధిగా ప్రతిపక్ష పార్టీపై మాటలు సంధించారు. ఆమె గత కొంతకాలంగా మౌనంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె పార్టీ మారుతున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. వీటన్నికి చెక్ పెడుతూ ఆమె టీవీ 9కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆస్తక్తికర అంశాలను ప్రస్తవించారు. తాను ఎందుకు మౌనంగా ఉండాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు.

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ అఖండమైన మెజారిటీతో గెలిచినందున ఆయా పార్టీలు అనుసరించే విధానాలను అర్ధం చేసుకోడానికి కొంత సమయం ఇవ్వాల్సి ఉంటుందన్నారు యామిని. అందుకే తాను మూడు నెలలపాటు మౌనంగా ఉన్నట్టు తెలిపారు. అయితే తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశారు. రాజకీయాల్లోకి వచ్చిన ప్రతిఒక్కరికి సమాజంపై బాధ్యత ఉంటుందని, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వస్తారని.. తాను కూడా అలాగే వచ్చానని తెలిపారు.

ఇంతకాలం మౌనం తర్వాత తమ పార్టీ అధినేత చంద్రబాబును ఆదేశాలు అందుకున్నట్టుగా చెప్పారు. ప్రతి రాజకీయపార్టీలోనూ చిన్నచిన్న సమస్యలనేవి ఉంటాయని వాటిని అధిగమించాలి తప్ప తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తాను మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వస్తున్నట్టు చెప్పారు. తాను పార్టీ మాత్రం మారే పరిస్థితి లేదన్నారు యామిని.

సాధినేని యామిని టీడీపీ మహిళా విభాగంలో పార్టీకి సేవలందించారు. గత ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, ప్రతిపక్షపార్టీని విమర్శించడంలో తనదైన ముద్రను వేసుకున్నారు యామిని. అయితే ఆమె గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉండటంతో పార్టీ మార్పుపై ఊహాగానాలు వెలువడ్డాయి. తాజా ఇంటర్వ్యూలో అవన్నీకట్టుకథలంటూ తేల్చిపారేశారు.