HCU: హెచ్‌సీయూ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. నో ఎగ్జామ్స్.. ఓన్లీ గ్రేడింగ్.!

డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం చదివే విద్యార్ధులకు సెప్టెంబర్ లోగా పరీక్షలు నిర్వహించాలని తాజాగా యూజీసీ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే హెచ్‌సీయూకి వర్తించవన్న వర్సిటీ అధికారులు స్పష్టం చేశారు.

HCU: హెచ్‌సీయూ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. నో ఎగ్జామ్స్.. ఓన్లీ గ్రేడింగ్.!
Follow us

|

Updated on: Jul 12, 2020 | 11:17 AM

HCU Final Year No Exams: డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం చదివే విద్యార్ధులకు సెప్టెంబర్ లోగా పరీక్షలు నిర్వహించాలని తాజాగా యూజీసీ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే హెచ్‌సీయూలో చదువుతున్న విద్యార్ధులకు మాత్రం ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా జారీ చేసిన గ్రేడింగే తుది ఫలితాలని వర్సిటీ అధికారులు స్పష్టం చేశారు. యూజీసీ ఆదేశాలు అందేలోపే విద్యార్ధులకు గ్రేడింగ్ ఇవ్వడంతో పాటుగా నెలరోజుల క్రితమే మెమోలను సైతం జారీ చేశామని వారు అంటున్నారు. యూజీసీ జారీ చేసిన తాజా ఆదేశాలు హెచ్‌సీయూకి వర్తించవన్న వర్సిటీ అధికారులు.. స్టూడెంట్స్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే గ్రేడింగ్ నిర్ణయాన్ని తీసుకున్నామని వెల్లడించారు.

కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా గ్రేడింగ్ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు పేర్కొంటూ జూన్‌లోనే ఎంసీహెచ్‌ఆర్‌డీ, యూజీసీకి నివేదికను పంపించామని.. యూజీసీ కమిటీలో హెచ్‌సీయూ వీసీ కూడా ఉండటంతో పలుసార్లు ఈ నిర్ణయంపై చర్చలు కూడా జరిగాయని వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. కాగా, తాజాగా యూజీసీ జారీ చేసిన ఆదేశాలతో ఈ ఏడాది హెచ్‌సీయూ నుంచి పాస్ ఔట్ అయిన విద్యార్ధుల్లో గందరగోళం నెలకొంది. దీనితో వర్సిటీ అధికారులు చివరి సంవత్సరం విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సెప్టెంబర్‌లో పరీక్షలు నిర్వహిస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు. అటు ఫస్టియర్ విద్యార్ధులను పరీక్షలు లేకుండానే పైతరగతికి ప్రమోట్ చేయనున్న హెచ్‌సీయూ.. యూజీసీ తాజా నిర్ణయంపై చర్చించి 10 రోజుల్లో తుది ప్రకటన చేయనుంది.

Also Read:

 కరోనా కట్టడిలో జగన్ సర్కార్ దూకుడు.. ఇంటికే ఉచితంగా కరోనా కిట్..

విద్యార్ధులకు ఆ రోజే ‘జగనన్న విద్యా కానుక’.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం