ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. శ్రీకాళహస్తిలో దర్శనాలకు నో ఎంట్రీ!

తిరుపతి సమీపంలో ఉన్న శ్రీకాళహస్తి ఆలయ దర్శనాలకు మాత్రం ఇప్పట్లో అనుమతులు ఇచ్చే అవకాశం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా కంటైన్మెంట్ జోన్‌లో ఉన్నందున..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. శ్రీకాళహస్తిలో దర్శనాలకు నో ఎంట్రీ!
Follow us

|

Updated on: Jun 05, 2020 | 6:40 PM

అన్‌లాక్‌-1 నేపధ్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాలను తెరిచేందుకు రాష్ట్ర దేవాదాయశాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తిరుపతి, శ్రీశైలం వంటి ప్రముఖ ఆలయాల్లో భక్తులకు దర్శనాలు కల్పించేలా బోర్డు సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా నేపధ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు క్యూలైన్‌లో భక్తులు భౌతిక దూరాన్ని పాటించే విధంగా చర్యలు చేపడుతున్నారు. దర్శనాలకు వచ్చే భక్తులందరూ కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు.

ఇదిలా ఉంటే తిరుపతి సమీపంలో ఉన్న శ్రీకాళహస్తి ఆలయ దర్శనాలకు మాత్రం ఇప్పట్లో అనుమతులు ఇచ్చే అవకాశం లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా కంటైన్మెంట్ జోన్‌లో ఉండవల్లే దీనికి కారణమని తెలుస్తోంది. శ్రీకాళహస్తి వాయు లింగేశ్వర స్వామి దర్శనానికి భక్తులకు అనుమతిని నిషేదిస్తున్నట్లు ఆలయ ఈఓ చంద్రశేఖర్ వెల్లడించారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు భక్తులు ఆలయానికి రావొద్దని తెలిపారు. కాగా, ఈ నెల 11వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి సాధారణ భక్తులను అనుమతిస్తున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు.

ఇది చదవండి: ఇకపై ఏపీలోని బస్టాండులు, బస్ డిపోల్లో పెట్రోల్ బంక్‌లు..!