పార్టీ వీడిన వారిపై చంద్రబాబు సంచలన ప్రకటన

అధికారంలో వున్నప్పుడు పార్టీలో చేరి పదవులు అనుభవించి, పార్టీ ఓడిపోగానే తట్టా బుట్టా సర్దుకుని పాలకపక్షంలోకి దూకేసిన ద్రోహులను తిరిగి ఎన్నటికీ పార్టీలోకి రానివ్వనని అంటున్నారుl...

పార్టీ వీడిన వారిపై చంద్రబాబు సంచలన ప్రకటన
Follow us

|

Updated on: May 28, 2020 | 3:17 PM

Chandrababu clarified that no re-entry for betrayers: అధికారంలో వున్నప్పుడు పార్టీలో చేరి పదవులు అనుభవించి, పార్టీ ఓడిపోగానే తట్టా బుట్టా సర్దుకుని పాలకపక్షంలోకి దూకేసిన ద్రోహులను తిరిగి ఎన్నటికీ పార్టీలోకి రానివ్వనని అంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఒకసారి పార్టీని వీడిన స్వార్థపరులను తిరిగి పార్టీలోచి చేర్చుకోబోనని చంద్రబాబు కుండబద్దలు కొట్టారు.

మహానాడు వేదికగా చంద్రబాబు పార్టీ శ్రేణులనుద్దేశించి గురువారం ఉదయం నుంచి పలు మార్లు సంభాషించారు. మధ్యాహ్నం జరిగిన ఓ సంభాషణలో పార్టీ ఫిరాయింపుదారుల అంశం ప్రస్తావనకు రావడంతో చంద్రబాబు ఆవేశంగా, ఆవేదనాపూర్వకంగా స్పందించారు. పార్టీ అధికారంలో వున్నప్పుడు చేరి, పదవులు అనుభవించి, తీరా పార్టీ ఓడిపోయాక సొంత లాభం కోసం పార్టీ ఫిరాయించిన వారికి తిరిగి తెలుగుదేశం పార్టీలో చేర్చుకునేది లేదని ఆయన తెలిపారు.

పార్టీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 9 సార్లు ఎన్నికలు జరుగగా అందులో 5 సార్లు టీడీపీ గెలిచిందని, నాలుగు సార్లు ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల ఆర్ధిక మూలాల మీద దెబ్బకొడుతున్నారని, వ్యాపారాలను నిర్వీర్యం చేస్తున్నారని చంద్రబాబు ప్రస్తుత అధికార పార్టీపై నిప్పులు గక్కారు. వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీని వదిలి పెట్టి వెళ్లిపోయిన వాళ్లను మళ్లీ చేర్చుకునే ప్రసక్తే లేదని, అధికారంలో ఉన్నప్పుడు పార్టీలోకి వచ్చి పదవులు అనుభవించి వెళ్లిపోయారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

భవిష్యత్తులో యువతకు, మహిళలకు అధిక ప్రాధాన్యతను ఇస్తామని, తెలుగుదేశం పార్టీ ఒక ఫ్యాక్టరీ లాంటిది, ఇక్కడ నాయకులుగా తయారై.. వేరే పార్టీలో చేరి ఇపుడు మంత్రులుగా పలువురు పని చేస్తున్నారని ఆయన అంటున్నారు. ‘‘మనం నమ్మి పదవులు ఇచ్చిన వారు నమ్మక ద్రోహం చేసి వెళ్లిపోయారు.. మనం రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన వాళ్లు కూడా మనపై విమర్శలు చేస్తున్నారు..’’ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పార్టీ కమిటీలు వేస్తున్నామని, అనుబంధ సంస్థలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. జిల్లా కమిటీలు యాక్టివ్ గా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీని బలోపేతం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..