ట్రిపుల్ తలాక్ చట్ట ‘తీవ్రత’ తగ్గుతోందా ? నిందితుడి యాంటిసిపేటరీ బెయిల్ పై నిషేధం లేదన్న సుప్రీంకోర్టు

ముస్లిం మహిళల హక్కుల రక్షణ చట్టం-2019 కింద..ఓ ముస్లిం వ్యక్తి తన భార్య పట్ల నేరం చేసినా (ట్రిపుల్ తలాక్ చెప్పినా)..

ట్రిపుల్ తలాక్ చట్ట 'తీవ్రత' తగ్గుతోందా ? నిందితుడి యాంటిసిపేటరీ బెయిల్ పై నిషేధం లేదన్న సుప్రీంకోర్టు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 02, 2021 | 2:40 PM

ముస్లిం మహిళల హక్కుల రక్షణ చట్టం-2019 కింద..ఓ ముస్లిం వ్యక్తి తన భార్య పట్ల నేరం చేసినా (ట్రిపుల్ తలాక్ చెప్పినా) అతనికి యాంటిసిపేటరీ బెయిలును మంజూరు చేయదంట్లో నిషేధం లేదని సుప్రీంకోర్టు స్ఫష్టం చేసింది.  అప్పటికప్పుడు వీరు తమ భార్యలకు డైవోర్స్ ఇవ్వడానికి ట్రిపుల్ తలాక్ విధానాన్ని వినియోగించుకుంటున్నారు. కానీ కొత్త చట్టం కింద వీరు శిక్షార్హులవుతారని ఈ చట్ట నిబంధనలు పేర్కొంటున్నాయి. ప్రీ-అరెస్ట్ బెయిల్ ని నిందితునికి మంజూరు చేసేముందు బాధిత మహిళ(ఫిర్యాదుదారు) చెప్పే వాదనను కోర్టు ఆలకించాలని న్యాయమూర్తులు సూచించారు. ఈ చట్ట నిబంధనల మేరకు …తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పే భర్తకు మూడేళ్ళ వరకు జైలుశిక్ష విధించవచ్చు. ఇది కేవలం ముస్లిం వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుందని జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని బెంచ్ పేర్కొంది. ఈ చట్టంలోని 7 (సి) సెక్షన్తో బాటు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని 438, కింద  కూడా నేరానికి పాల్పడిన వ్యక్తికి యాంటిసిపేటరీ బెయిలును మంజూరు చేయవచ్ఛునని, కానీ బాధిత ముస్లిం మహిళ వాదనను కోర్టు ఆలకించాలని న్యాయమూర్తులు ఇందుమల్హోత్రా, ఇందిరా బెనర్జీ అభిప్రాయపడ్డారు.

ఈ బెయిల్ దరఖాస్తు పెండింగులో ఉన్న సందర్భంలో నిందితునికి తాత్కాలిక సాయం చేయాలా వద్దా అన్నది కోర్టు విచక్షణాధికారానికి లోబడి ఉంటుందని వారు అన్నారు. తన కోడలిని వేధిస్తోందన్న ఆరోపణపై ఓ ముస్లిం మహిళకు కోర్టు యాంటిసిపేటరీ బెయిలును మంజూరు చేస్తూ ఈ తీర్పు చెప్పింది.