Nithin Check Update: నితిన్‌ సినిమా అప్‌డేట్‌ వచ్చేస్తోంది.. ఎవరు ఎవరికి ‘చెక్‌’ పెడతారో చూడాలి..

Nithin Check Glimps: గతేడాది 'భీష్మ' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న హీరో నితిన్‌ అదే ఏడాదిలో వివాహ బంధంతో సెకండ్ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే...

Nithin Check Update: నితిన్‌ సినిమా అప్‌డేట్‌ వచ్చేస్తోంది.. ఎవరు ఎవరికి 'చెక్‌' పెడతారో చూడాలి..
Follow us

|

Updated on: Jan 02, 2021 | 5:51 PM

Nithin Check Glimps: గతేడాది ‘భీష్మ’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న హీరో నితిన్‌ అదే ఏడాదిలో వివాహ బంధంతో సెకండ్ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక కొత్తేడాదిలో వరుస సినిమాలను ప్లాన్‌ చేస్తూ దూసుకెళుతున్నాడీ యంగ్‌ హీరో. తాజాగా నితిన్‌ హీరోగా ఏకంగా మూడు సినిమాలు తెరకెక్కుతున్నాయి. అందులో ‘రంగ్‌ దే’ సంక్రాంతికి విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు అంధాధున్‌ తెలుగు రీమేక్‌, చంద్రశేఖర్‌ యేలేటి డైరెక్షన్‌లో ‘చెక్‌’ అనే సినిమాలో నటిస్తున్నాడు.తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్‌డేట్‌ ఇవ్వనున్నట్లు నితిన్‌ స్వయంగా తెలిపాడు.

ట్విట్టర్‌ వేదికగా ఓ పోస్టర్‌ను విడుదల చేసిన నితిన్‌ జనవరి 2న (ఆదివారం) సినిమా ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, పోస్టర్లు చిత్రంపై అంచనాలను పెంచేశాయి. ఇందులో నితిన్‌ ఉరిశిక్ష పడ్డ ఖైదీ పాత్రలో నటించనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే నేరస్థుడికి, చెస్‌కు సంబంధం ఏంటన్న ఆసక్తికర కథనంతో ఈ సినిమా రానున్నట్లు అర్థమవుతోంది. మరి ఎవరు ఎవరికి చెక్‌ పెడతారో.. అసలు ఈ సినిమా కాన్సెప్ట్‌ ఏంటో గ్లింప్స్‌తోనైనా తెలుస్తుందో చూడాలి. ఈ చిత్రంలో నితిన్ జంటగా రకుల్ ప్రీత్ సింగ్, మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో రకుల్ తొలిసారి లాయర్ పాత్రలో కనిపించనుంది.

Also Read: Pakisthan Police: మాస్కు ధరించాడని యువకుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు… ఎందకనేగా మీ సందేహం..