ప్రారంభమైన నితిన్ ఐదురోజుల పెళ్లి వేడుక

హీరో నితిన్‌ తన చిరకాల ప్రేయసి డాక్టర్. షాలినిల ఐదు రోజుల పెళ్లి వేడుక బుధవారం ప్రారంభమైంది. నితిన్, షాలిని కుటుంబ పెద్దలు నిశ్చయ తాంబూలాలు...

  • Sanjay Kasula
  • Publish Date - 5:40 am, Thu, 23 July 20
ప్రారంభమైన నితిన్ ఐదురోజుల పెళ్లి వేడుక

Nithin Engaged to Shalini at Hyderabad : హీరో నితిన్‌ తన చిరకాల ప్రేయసి డాక్టర్. షాలినిల ఐదు రోజుల పెళ్లి వేడుక బుధవారం ప్రారంభమైంది. నితిన్, షాలిని కుటుంబ పెద్దలు నిశ్చయ తాంబూలాలు మార్చుకున్నారు. తర్వాత నిశ్చితార్థ వేడుక నిర్వహించారు. నితిన్ నివాసంలో జరిగిన ఈ వేడుకకు కొద్ది మంది సన్నిహితులను మాత్రమే ఇరు కుటుంబాలు ఆహ్వానించాయి.

ఈ వేడుకకు సంబంధించిన ఫొటోను తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలతోపాటు ‌ నితిన్ ‘అండ్‌ ఎంగేజ్‌డ్‌’ అనే వ్యాఖ్యను జోడించారు. ఈ ఫొటోలో షాలిని వేలికి ఉంగరాన్ని తొడుగుతూ నితిన్‌ కనిపిస్తున్నారు.

ఈ నెల 26న రాత్రి 8.30 గంటలకు ఫలక్‌నామా ప్యాలెస్‌లో నితిన్‌, షాలినిల పెళ్లి జరుగనుంది. ప్రభుత్వం నిర్దేశించిన లాక్‌డౌన్‌ మార్గదర్శకాలకు అనుగుణంగానే నిరాడంబరంగా ఈ జంట పెళ్లి వేడుకను నిర్వహించనున్నారు.