నా కుమార్తె ఫొటోను కౌగలించుకున్నా: నిర్భయ తల్లి భావోద్వేగం

Nirbhaya Verdict: యావత్ దేశమంతా ఎదురుచూస్తున్న క్షణం ఇదే. ఎట్టకేలకు నిర్భయ దోషులకు ఉరి శిక్ష పడింది. నలుగురు దోషులైన అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముకేశ్ సింగ్‌లను తలారీ పవన్ ఒకేసారి ఉరి తీశాడు. ఇలా నలుగురికి ఉరి పడటం దేశంలోనే తొలిసారి అని చెప్పవచ్చు. ఉరి కంబంపై నలుగురు దోషులు వేలాడగా.. కొద్దిసేపటి క్రితమే వాళ్లు మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం డీడీయూ ఆసుపత్రికి తరలించి.. […]

  • Ravi Kiran
  • Publish Date - 6:49 am, Fri, 20 March 20
నా కుమార్తె ఫొటోను కౌగలించుకున్నా: నిర్భయ తల్లి భావోద్వేగం

Nirbhaya Verdict: యావత్ దేశమంతా ఎదురుచూస్తున్న క్షణం ఇదే. ఎట్టకేలకు నిర్భయ దోషులకు ఉరి శిక్ష పడింది. నలుగురు దోషులైన అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముకేశ్ సింగ్‌లను తలారీ పవన్ ఒకేసారి ఉరి తీశాడు. ఇలా నలుగురికి ఉరి పడటం దేశంలోనే తొలిసారి అని చెప్పవచ్చు. ఉరి కంబంపై నలుగురు దోషులు వేలాడగా.. కొద్దిసేపటి క్రితమే వాళ్లు మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం డీడీయూ ఆసుపత్రికి తరలించి.. ఆ తర్వాత కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.

ఇదిలా ఉంటే నలుగురు దోషులకు ఉరి పడటంతో నిర్బయ తల్లి ఆశాదేవి హర్షం వ్యక్తం చేశారు. ఆలస్యమైనా చివరికి న్యాయమే గెలిచిందని ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ కూతురుకు న్యాయం జరిగినందుకు సంతోషంగా ఉందని.. అలాగే ఇంతకాలం తమ తరపున పోరాడిన లాయర్లకు ఆశాదేవి కృతజ్ఞతలు తెలిపారు. దోషులకు ఉరి పడిన తర్వాత తన కూతురు ఫోటోను కౌగిలించుకున్నట్లు ఆమె వెల్లడించారు. కాగా, ఇలాంటి కేసుల్లో సత్వర న్యాయం జరిగేలా న్యాయ పోరాటం చేస్తానని.. ఇప్పటికైనా చట్టంలోని లోపాలను సరిచేయాలని నిర్భయ తల్లి ఆశాదేవి వెల్లడించారు.

For More News:

నిర్భయ ‘ఆశ’ల పోరాటానికి హ్యాట్సాఫ్..!

నిర్భయ తరపు న్యాయవాది ఫీజు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

వారిని కాదు.. నిర్భయ తల్లిని శిక్షించాలట.. దోషుల తరపు లాయర్

Breaking… నిర్భయ దోషులకు ఉరి అమలు…

కరోనా ఎటాక్ @ సెకండ్ లెవెల్.. భారత్‌కు మిగిలింది 30 రోజులు మాత్రమే

కరోనా ఎఫెక్ట్.. రసికప్రియులకు గుడ్ న్యూస్…

Breaking: ఏపీలో రెండో కరోనా పాజిటివ్ కేసు..

కరోనా భయం.. తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు వేల కోళ్లు సజీవ సమాధి..