నిర్బయ దోషి ముఖేశ్‌పై లైంగిక దాడి..!

నిర్బయ కేసులో దోషి ముఖేశ్ సింగ్ పిటిషన్‌పై కోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. తన క్షమాబిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ఆమోదించకపోవడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించాడు ముఖేశ్. చీఫ్ జస్టిస్ బాబ్డేతో పాటు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ కూడిన త్రిసభ్య దర్మాసనం ఈ పిటిషన్‌‌పై విచారణ చేపట్టింది. అయితే విచారణ సమయంలో సంచలన ఆరోపణలు చేశాడు ముఖేశ్ సింగ్. తీహార్ జైల్లో తనపై లైంగిక దాడి జరిగిందని ఆరోపించాడు. సహ నిందితుడు అక్షయ్ ఠాకూర్ జైల్లో […]

నిర్బయ దోషి ముఖేశ్‌పై లైంగిక దాడి..!
Follow us

|

Updated on: Jan 28, 2020 | 5:30 PM

నిర్బయ కేసులో దోషి ముఖేశ్ సింగ్ పిటిషన్‌పై కోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. తన క్షమాబిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ఆమోదించకపోవడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించాడు ముఖేశ్. చీఫ్ జస్టిస్ బాబ్డేతో పాటు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ కూడిన త్రిసభ్య దర్మాసనం ఈ పిటిషన్‌‌పై విచారణ చేపట్టింది. అయితే విచారణ సమయంలో సంచలన ఆరోపణలు చేశాడు ముఖేశ్ సింగ్. తీహార్ జైల్లో తనపై లైంగిక దాడి జరిగిందని ఆరోపించాడు. సహ నిందితుడు అక్షయ్ ఠాకూర్ జైల్లో తనపై అత్యాచారం చేశాడని తెలిపాడు. తీహర్ జైలు అధికారులు కూడా ఇందుకు సహకరించారని పేర్కొన్నాడు. రాష్ట్రపతికి పెట్టుకున్న క్షమాబిక్ష పిటిషన్‌లో ఈ విషయాలన్నీ మొరపెట్టుకున్నప్పటికి పట్టించుకోలేదన్నాడు. క్షమాబిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించడంతో జ్యుడిషియల్ రివ్యూ కోరాడు ముఖేశ్. ఆర్టికల్ 32 కింద ఈ పిటిషన్ దాఖలు చేశాడు.  విచారణను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం..తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. అయితే గౌరవ రాష్ట్రపతి నిర్ణయాన్ని సుప్రీం వ్యతిరేకించపోవచ్చుగానీ, న్యాయపరంగా ఏమైనా లోటుపాట్లు ఉంటే మరోసారి పరిశీలించమని అభ్యర్థించే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఫిబ్రవరి 1వ తేదీన నిర్బయ దోషుల ఉరి కోసం జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ట్రయిల్స్ కూడా నిర్వహించారు. శిక్ష నుంచి తప్పించుకునేందుకే దోషులు డ్రామాలు ఆడుతున్నారని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.