వారిని కాదు.. నిర్భయ తల్లిని శిక్షించాలట.. దోషుల తరపు లాయర్

ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు నిర్భయ దోషులకు ఉరి పడింది. కొద్దిసేపటి క్రితం తీహార్ జైలులో నలుగురు దోషులైన అక్షయ్ ఠాకూర్, ముఖేశ్‌సింగ్‌, వినయ్‌ శర్మ, పవన్‌ గుప్తాలను తలారీ పవన్ ఒకేసారి ఉరి తీశారు. దీనితో నిర్భయ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేయగా.. తీహార్ జైలు బయట సంబరాలు మిన్నంటాయి. ఇదిలా ఉంటే న్యాయ వ్యవస్థలోని పలు లొసుగులను వాడుకుంటూ.. ఏడేళ్ల పాటు ఈ నలుగురిని శిక్ష నుంచి తప్పిస్తూ వచ్చిన న్యాయవాది ఏపీ […]

వారిని కాదు.. నిర్భయ తల్లిని శిక్షించాలట.. దోషుల తరపు లాయర్
Follow us

|

Updated on: Mar 20, 2020 | 2:14 PM

ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు నిర్భయ దోషులకు ఉరి పడింది. కొద్దిసేపటి క్రితం తీహార్ జైలులో నలుగురు దోషులైన అక్షయ్ ఠాకూర్, ముఖేశ్‌సింగ్‌, వినయ్‌ శర్మ, పవన్‌ గుప్తాలను తలారీ పవన్ ఒకేసారి ఉరి తీశారు. దీనితో నిర్భయ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేయగా.. తీహార్ జైలు బయట సంబరాలు మిన్నంటాయి.

ఇదిలా ఉంటే న్యాయ వ్యవస్థలోని పలు లొసుగులను వాడుకుంటూ.. ఏడేళ్ల పాటు ఈ నలుగురిని శిక్ష నుంచి తప్పిస్తూ వచ్చిన న్యాయవాది ఏపీ సింగ్ నిర్భయ తల్లిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమెను శిక్షించాలంటూ అతడు చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

రాత్రి 12 గంటల వరకు తన కూతురు ఎక్కడుందో, ఎవరితో ఉందో తెలియని నిర్బయ తల్లి ఆశాదేవిని శిక్షించాలంటూ డిమాండ్ చేశాడు. కాగా, అతడు చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అటు కరోనా‌తో లింక్ పెట్టి.. కేంద్రం మాస్కులు ఖరీదు చేయడంలో ఆలస్యం చేస్తోందని.. అయితే ఉరితాళ్లను మాత్రం తొందరగా సిద్ధం చేస్తోందన్నాడు. ఇక సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఏపీ సింగ్‌ను కూడా ఉరి తీయాలంటూ తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

For More News:

నిర్భయ ‘ఆశ’ల పోరాటానికి హ్యాట్సాఫ్..!

నిర్భయ తరపు న్యాయవాది ఫీజు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

వారిని కాదు.. నిర్భయ తల్లిని శిక్షించాలట.. దోషుల తరపు లాయర్

నా కుమార్తె ఫొటోను కౌగలించుకున్నా: నిర్భయ తల్లి భావోద్వేగం

Breaking… నిర్భయ దోషులకు ఉరి అమలు…

కరోనా ఎటాక్ @ సెకండ్ లెవెల్.. భారత్‌కు మిగిలింది 30 రోజులు మాత్రమే

కరోనా ఎఫెక్ట్.. రసికప్రియులకు గుడ్ న్యూస్…

Breaking: ఏపీలో రెండో కరోనా పాజిటివ్ కేసు..

కరోనా భయం.. తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు వేల కోళ్లు సజీవ సమాధి..