బిగ్ బ్రేకింగ్ : నిర్బయ దోషులకు ఉరిశిక్ష అమలుపై స్టే..

నిర్బయ దోషులకు ఉరిశిక్ష మళ్లీ వాయిదా పడింది. వాస్తవానికి రేపు ఉదయం 6 గంటలకు నలుగురు దోషులను ఉరితీయాల్సి ఉంది. ఐతే చివరి నిమిషంలో శిక్ష అమలుపై స్టే విధిస్తూ ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు తీర్పునిచ్చింది. టిల్ ఫర్‌దర్ అంటే తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు కోర్టు ఉరి శిక్షను వాయిదా వేసింది. దీన్ని వాయిదా అనలేం…ఈ ఉత్తర్వులను కోర్టు ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. మరోవైపు నేరం జరిగినప్పుడు తాను మైనర్‌ని అని  పవన్ గుప్తా వేసిన […]

బిగ్ బ్రేకింగ్ : నిర్బయ దోషులకు ఉరిశిక్ష అమలుపై స్టే..
Follow us

|

Updated on: Jan 31, 2020 | 6:06 PM

నిర్బయ దోషులకు ఉరిశిక్ష మళ్లీ వాయిదా పడింది. వాస్తవానికి రేపు ఉదయం 6 గంటలకు నలుగురు దోషులను ఉరితీయాల్సి ఉంది. ఐతే చివరి నిమిషంలో శిక్ష అమలుపై స్టే విధిస్తూ ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు తీర్పునిచ్చింది. టిల్ ఫర్‌దర్ అంటే తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు కోర్టు ఉరి శిక్షను వాయిదా వేసింది. దీన్ని వాయిదా అనలేం…ఈ ఉత్తర్వులను కోర్టు ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. మరోవైపు నేరం జరిగినప్పుడు తాను మైనర్‌ని అని  పవన్ గుప్తా వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ఈ రోజు(శుక్రవారం) కొట్టివేసింది. ఈ క్రమంలో నలుగురు దోషులకు రేపు ఉరి కన్ఫామ్ అనుకున్నారు అందరూ. కానీ దోషులు నలుగరూ మళ్లీ ట్రయిల్ కోర్టును ఆశ్రయించారు. తమ నలుగురుకీ ఇంకా న్యాయపరమైన ప్రయత్నాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయని, అందుకే  చిట్టచివరి అవకాశం ఇవ్వాలని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. నలుగురు దోషులలో ఇప్పటికి ముగ్గురే రాష్ట్రపతికి క్షమాబిక్ష పిటిషన్లను పెట్టుకున్నారని, అందులో ఇద్దరి పిటిషన్లను ప్రెసిడెంట్ రిజక్ట్ చెయ్యగా..మరొకరిది పెండింగ్‌లో ఉందని వారు తెలిపారు. ఇంకొకరు ఇంతవరకు క్షమాబిక్ష పిటిషన్ దాఖలు చెయ్యలేదు. దీంతో కోర్టు శిక్ష పాటియాలా కోర్టు శిక్ష అమలుపై స్టే విధించింది.  కాగా ఉరి శిక్ష అమలును జాప్యం చెయ్యాలనే..దోషుల తరపు న్యాయవాదులు ఒకేసారి నలుగురి పిటిషన్లు దాఖలు చెయ్యకుండా, ఒక్కొక్కటిగా దాఖలు చేశారని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి జనవరి 22న నలుగురు దోషులను ఉరి తీయాల్సి ఉంది. కానీ న్యాయపరమైన చిక్కులు కారణంగా అది ఫిబ్రవరి 1కి వాయిదా పడింది. తాజాగా మరోసారి శిక్ష అమలు వాయిదా పడటం చర్చనీయాంశమైంది.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!