Janasena Party: నిర్భయను అత్యంత దారుణంగా హతమార్చిన నలుగురిని ఉరి తీసిన శుక్రవారం ఉదయం అత్యంత గొప్పదని జనసేన పార్టీ అభివర్ణించింది. నిర్భయ దోషులను బహిరంగంగా ఉరి తీసి ఉంటే సమాజంలో కొంతైనా మార్పుకు అవకాశం ఉండేది అని అభిప్రాయపడింది.
మానవమృగాలకు మరణశిక్షపడిన రోజు ఒక గొప్ప సూర్యోదయం అని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు.లాయర్లు చేసిన పోరాటాన్ని చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది అని చెప్పారు. దిశ చట్టం తెచ్చిన ఏపీ సీఎం జగన్ కు చిత్తశుద్ధి ఉంటే ఆయేషామీరా,సుగాలిప్రీతిల విషయంలోను న్యాయం చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు.
అయేషా మీరా కేసులో ఆల్రెడీ సిబిఐ విచారణ కొనసాగుతుండగా.. సుగాలి ప్రీతి కేసును కూడా సీబీఐకి అప్పగించేందుకు జగన్ ప్రభుత్వం రెడీ అవుతోంది. అయితే జనసేన అభిప్రాయంతో పలు మహిళా సంఘాలు కూడా ఏకీభవిస్తున్నాను. నిర్భయ కేసు దోషులను బహిరంగంగా ఉరి తీసి ఉంటే రేపిస్టుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేవని పలువురు అభిప్రాయపడుతున్నారు.