నిర్భయ కేసు.. పోలీసులపై దోషి పవన్ ఫిర్యాదు.. రేపు కోర్టు విచారణ

నిర్బయ కేసులో దోషులు తాము ఎలాగైనా ఉరిశిక్షను తప్పించుకునేందుకు వేయని ఎత్తుగడలు లేవు.. తాజాగా ఈ దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్తా.. గత ఏడాది తాను ఈస్ట్ ఢిల్లీలోని మండోలీ జైల్లో ఉన్నప్పుడు ఇద్దరు పోలీసులు తనను చావబాదారని, దాంతో తన తలకు తీవ్ర గాయాలయ్యాయని.

  • Umakanth Rao
  • Publish Date - 6:16 pm, Wed, 11 March 20
నిర్భయ కేసు.. పోలీసులపై దోషి పవన్ ఫిర్యాదు.. రేపు కోర్టు విచారణ

నిర్బయ కేసులో దోషులు తాము ఎలాగైనా ఉరిశిక్షను తప్పించుకునేందుకు వేయని ఎత్తుగడలు లేవు.. తాజాగా ఈ దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్తా.. గత ఏడాది తాను ఈస్ట్ ఢిల్లీలోని మండోలీ జైల్లో ఉన్నప్పుడు ఇద్దరు పోలీసులు తనను చావబాదారని, దాంతో తన తలకు తీవ్ర గాయాలయ్యాయని.వారిపై ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేయాల్సిందిగా హర్ష విహార్ పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ను ఆదేశించవలసిందిగా కోరుతూ ఢిల్లీలోని స్థానిక కోర్టులో ఓ దరఖాస్తు వేశాడు. దీంతో  ఢిల్లీ కర్కర్ డూమా కోర్టు.. మండోలీ జైలు అధికారులకు నోటీసులు జారీ చేస్తూ.. దీనిపై గురువారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగాలని ఆదేశించింది. తన దరఖాస్తులో పవన్,.. హరీష్ కుమార్ అనే కానిస్టేబుల్, మరో పోలీసు కలిసి తమ లాఠీలతో కుళ్ళబొడిచారని, తన తలపై పిడిగుద్దులు కురిపించారని పేర్కొన్నాడు. వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చూడాలని కోరాడు. తీవ్ర గాయాల పాలయిన తాను  ఆసుపత్రిలో చికిత్స పొందానని తెలిపాడు. కాగా.. ఈ కేసులో పవన్ తో బాటు ఇతర దోషులు వినయ్, అక్షయ్, ముకేశ్ లను ఈ నెల 20 వ తేదీ ఉదయం అయిదున్నర గంటలకు ఉరి తీయాల్సి ఉంది.