నేడు జేఆర్సీ కన్వెన్షన్‌‌లో నీహారిక – చైతన్యల రిసెప్షన్, పాస్‌వర్డ్ ఉంటేనే లోపలికి ఎంట్రీ

మెగా ప్రిన్సెస్ నీహారిక-చైతన్య జొన్నలగడ్డ వివాహం బుధవారం రాత్రి 7 గంటల 15 నిమిషాలకు బందుమిత్రులు సమక్షంలో గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. 

నేడు జేఆర్సీ కన్వెన్షన్‌‌లో నీహారిక - చైతన్యల రిసెప్షన్, పాస్‌వర్డ్ ఉంటేనే లోపలికి ఎంట్రీ
Follow us

|

Updated on: Dec 11, 2020 | 7:13 PM

మెగా ప్రిన్సెస్ నీహారిక-చైతన్య జొన్నలగడ్డ వివాహం బుధవారం రాత్రి 7 గంటల 15 నిమిషాలకు బందుమిత్రులు సమక్షంలో గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే.  ఈ వేడుకకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ‘హోటల్ ది ఒబెరాయ్ ఉదయ్‌విలాస్’‌ వేదికైంది.  ప్రస్తుతం నీహారిక-చైతన్య ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మెగా-అల్లు కుటుంబాల స్టార్స్ అందరూ ఈ వేడుకలో పాల్గొని నూతన దంపతులకు ఆశీస్సుల ఇవ్వడంతో పాటు శుభాకాంక్షలు తెలియజేశారు.

కాగా నేడు హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో నీహారిక – చైతన్య రిసెప్షన్‌ జరుగుతోంది.  చైతన్య తరఫు వారు శుక్రవారం సాయంత్రం బంధుమిత్రులకు రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు.  ప్రైవేట్‌ ఫంక్షన్‌గా ఈ  వేడుక‌ జరుగుతోంది. ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు. జేఆర్సీ కన్వెన్షన్‌ లోపలికి వెళ్లడానికి పాస్‌ వర్డ్‌ని క్రియేట్‌ చేశారు కుటుంబసభ్యులు. వేడుక కోసం జేఆర్సీ ప్రాంగణాన్ని గ్రాండ్‌గా డెకరేట్ చేశారు.  కరోనా‌ నిబంధనలకు అనుగుణంగా అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని పనులను నీహారిక సోదరుడు వరుణ్‌తేజ్ దగ్గరుండి చూసుకుంటున్నారు.

Also Read :

అగ్గితో ఆటలొద్దు..సీఎం మమతా బెనర్జీకు గవర్నర్ జగ్​దీప్​​ ధనకర్ డైరెక్ట్ వార్నింగ్

రైతులకు ఆదాయం పెంచే విధానాలపై ఫోకస్ పెట్టండి, బ్యాంకర్లకు సీఎం జగన్ సూచన

బుమ్రా కొట్టిన షాట్​కు గ్రౌండ్‌లో కుప్పకూలిన ఆసీస్ బౌలర్​, నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న సిరాజ్ పరిగెత్తుకు వెళ్లి..