కేరళ గోల్డ్‌ స్కామ్‌లో‌ మరో కీలక మలుపు.. చార్జ్‌షీట్‌లో కనిపించని సీఎం మాజీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పేరు

కేరళ గోల్డ్‌స్కామ్‌ మరో కీలక మలుపు తిరిగింది. బంగారం స్మగ్లింగ్‌ కేసులో ఎన్‌ఐఏ 20 మంది నిందితులపై చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో ఈ చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. గత ఏడాది జులైలో దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా చార్జ్‌షీట్‌ దాఖలయ్యింది. అయితే ఈ కేసులో...

కేరళ గోల్డ్‌ స్కామ్‌లో‌ మరో కీలక మలుపు.. చార్జ్‌షీట్‌లో కనిపించని సీఎం మాజీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పేరు
Follow us

|

Updated on: Jan 05, 2021 | 9:51 PM

Kerala Gold Smuggling : కేరళ గోల్డ్‌స్కామ్‌ మరో కీలక మలుపు తిరిగింది. బంగారం స్మగ్లింగ్‌ కేసులో ఎన్‌ఐఏ 20 మంది నిందితులపై చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో ఈ చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. గత ఏడాది జులైలో దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా చార్జ్‌షీట్‌ దాఖలయ్యింది. అయితే ఈ కేసులో జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న సీఎం మాజీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శివశంకర్‌ పేరు మాత్రం చార్జ్‌షీట్‌లో లేదు. శివశంకర్‌ను ఈ కేసులో ఎన్‌ఐఏ ప్రశ్నించింది. సరిత్‌ , స్వప్న సురేశ్‌ , రమేశ్‌ , జలాల్‌ తదితరులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. నవంబర్‌ 2019 నుంచి జున్‌ 2020 మధ్య 167 కేజీల బంగారాన్ని దుబాయ్‌ నుంచి కేరళకు అక్రమంగా తరలించినట్టు అభియోగాలు నమోదయ్యాయి.

అంతేకాకుండా ప్రధాన నిందితులు దుబాయ్‌తో పాటు సౌదీఅరేబియా , మలేషియా , బహ్రేన్‌ దేశాల నుంచి కూడా బంగారాన్ని స్మగ్లింగ్‌ చేసేందుకు ప్రయత్నించినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. గత ఏడాది జులై 5న త్రివేండ్రం ఎయిర్‌పోర్ట్‌కు దుబాయ్‌ నుంచి వచ్చిన కార్గో విమానంలో 30 కేజీల బంగారం పట్టుబడింది. అప్పట్లో ఈ కేసు సంచలనం రేపింది. సాక్షాత్తూ సీఎం కార్యాలయం సిబ్బంది సాయంతోనే దుబాయ్‌ నుంచి త్రివేండ్రానికి బంగారం స్మగ్లింగ్‌ జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

స్మగ్లింగ్‌ కేసులో సూత్రధారిగా ఉన్న స్వప్న సురేశ్‌కు సీఎం మాజీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శివశంకర్‌ అండగా ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. స్వప్న సురేశ్‌ను కేసు నుంచి తప్పించడానికి సీఎం కార్యాలయం నుంచి ఫోన్లు వచ్చాయని కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే స్వప్న సురేశ్‌ అప్రూవర్‌గా మారారు. అయితే స్వప్న సురేశ్‌ ఎవరో తనకు తెలియదని కేరళ సీఎం విజయన్‌ స్పష్టం చేశారు. కావాలనే లెఫ్ట్‌ సర్కార్‌ను బద్నామ్‌ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..