శ్రీ రాధా కృష్ణుడి ఆలయాన్ని దర్శించుకున్న న్యూజిలాండ్ ప్రధాని..

ఆక్లాండ్ లోని శ్రీ రాధా కృష్ణుడి ఆలయాన్ని న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిండా ఆర్డెర్న్ దర్శించుకున్నారు. ఆక్లాండ్ లోని రాధాక్రిషన్ ఆలయానికి వచ్చిన తను .. కారు దిగగానే ముందుగా.. పాదరక్షలు విడిచి అక్కడున్నవారిని నమస్తే అంటు పలకరించారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. హారతి అనంతరం ప్రధాని జసిండాను శేషవస్త్రంతో సత్కరించారు ఆలయ నిర్వాహకులు. ఆ తర్వాత ఆలయంలోనే భోజనం కూడా చేశారు. భోజనంలో భాగంగా పూరీ, చోలే మసాలను తిన్నారు. అక్కడివారితో కాసేపు […]

శ్రీ రాధా కృష్ణుడి ఆలయాన్ని దర్శించుకున్న న్యూజిలాండ్ ప్రధాని..
Follow us

|

Updated on: Aug 08, 2020 | 11:39 PM

ఆక్లాండ్ లోని శ్రీ రాధా కృష్ణుడి ఆలయాన్ని న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిండా ఆర్డెర్న్ దర్శించుకున్నారు. ఆక్లాండ్ లోని రాధాక్రిషన్ ఆలయానికి వచ్చిన తను .. కారు దిగగానే ముందుగా.. పాదరక్షలు విడిచి అక్కడున్నవారిని నమస్తే అంటు పలకరించారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. హారతి అనంతరం ప్రధాని జసిండాను శేషవస్త్రంతో సత్కరించారు ఆలయ నిర్వాహకులు.

ఆ తర్వాత ఆలయంలోనే భోజనం కూడా చేశారు. భోజనంలో భాగంగా పూరీ, చోలే మసాలను తిన్నారు. అక్కడివారితో కాసేపు వివిధ అంశాలపై చర్చించి తిరుగుపయనం అయ్యారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

న్యూజిలాండ్ లో సెప్టెంబరులో ఎన్నికలు జరుగనున్నాయి. లేబర్ పార్టీ ఎన్నికల లెక్కల ప్రకారం ఆర్డెర్న్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని భావిస్తున్నారు.