100 రోజులుగా.. అక్కడ కరోనా కేసు నమోదు కాలేదు..!

100 రోజులుగా.. అక్కడ కరోనా కేసు నమోదు కాలేదు..!

ప్రపంచదేశాలను కరోనా వైరస్ పట్టి పీడిస్తుంటే.. చిన్న దేశమైన న్యూజిలాండ్ మాత్రం మహమ్మారిని పూర్తిగా కట్టడి చేసింది. గడిచిన 100 రోజులుగా అక్కడ స్థానికంగా కొత్త కరోనా కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు.

Ravi Kiran

|

Aug 09, 2020 | 10:47 PM

No New Corona Case In New Zealand: ప్రపంచదేశాలను కరోనా వైరస్ పట్టి పీడిస్తుంటే.. చిన్న దేశమైన న్యూజిలాండ్ మాత్రం మహమ్మారిని పూర్తిగా కట్టడి చేసింది. గడిచిన 100 రోజులుగా అక్కడ స్థానికంగా కొత్త కరోనా కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు. ఈ విషయాన్ని అక్కడి వైద్యాధికారులు ధృవీకరించారు. దీనితో ప్రభుత్వ వర్గాలు హర్ష వ్యక్తం చేస్తున్నాయట. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో కేవలం 23 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. అవి కూడా వేరే దేశం నుంచి ఆ దేశంలోకి అడుగుపెట్టినప్పుడు గుర్తించినవే.

స్థానికంగా గడిచిన 100 రోజుల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం హర్షించదగిన విషయమని అక్కడి హెల్త్ డైరెక్టర్ జ‌న‌ర‌ల్ యాష్లే బ్లూమ్‌ఫీల్డ్ తెలిపారు. మే 1న చివరిసారిగా స్థానిక కరోనా కేసు నమోదైందన్నారు. కరోనా ఫస్ట్ కేసు నుంచే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో.. ఆ మహమ్మారిని కంట్రోల్ చేయగలిగామని ఆయన అంటున్నారు.

కాగా, న్యూజిలాండ్ చాలా చిన్న దేశం. సుమారు 50 లక్షల జనాభా ఉంటుంది. మార్చి 19 నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలు ఆపేసిన అక్కడి ప్రభుత్వం.. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి తప్పనిసరి చేసింది. అంతేకాకుండా విదేశాల నుంచి వచ్చినవారికి 14 రోజుల హోం క్వారంటైన్ విధించింది. ఇలా కఠిన చర్యలు తీసుకోవడంతో కరోనాను కంట్రోల్ చేసిన దేశాల లిస్టులో న్యూజిలాండ్ మొదటి స్థానంలో నిలిచింది. దీనితో న్యూజిలాండ్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu