మ్యాచ్‌లు ఓడిపోయినా..మనసులు గెలిచారు..

5వ టీ20లో కూడా కివీస్‌కు పరాజయం తప్పలేదు. దీంతో 5-0తేడాతో భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. అలా అని న్యూజిలాండ్ ఎక్కడా తక్కువ ప్రదర్శన  చెయ్యలేదు. బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ సత్తా చాటింది. మంచి పోరాట పటిమ చూపించింది. అయితే సొంతగడ్డపై వైట్ వాష్ అవ్వడం కివీస్‌కు అవమానకరమే. కానీ బ్లాక్ క్యాప్స్ అంచనాలకు తగ్గట్టుగా ఆడినా..అదృష్ణమే వారికి కలిసిరాలేదు. 3, 4 టీ20లలో స్కోర్లు సమం కావడం..సూపర్ ఓవర్ ఫలితాలు వారికి వ్యతిరేకంగా రావడం..న్యూజిలాండ్ టీమ్‌ వెనకబడిపోవడానికి […]

మ్యాచ్‌లు ఓడిపోయినా..మనసులు గెలిచారు..

5వ టీ20లో కూడా కివీస్‌కు పరాజయం తప్పలేదు. దీంతో 5-0తేడాతో భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. అలా అని న్యూజిలాండ్ ఎక్కడా తక్కువ ప్రదర్శన  చెయ్యలేదు. బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ సత్తా చాటింది. మంచి పోరాట పటిమ చూపించింది. అయితే సొంతగడ్డపై వైట్ వాష్ అవ్వడం కివీస్‌కు అవమానకరమే. కానీ బ్లాక్ క్యాప్స్ అంచనాలకు తగ్గట్టుగా ఆడినా..అదృష్ణమే వారికి కలిసిరాలేదు. 3, 4 టీ20లలో స్కోర్లు సమం కావడం..సూపర్ ఓవర్ ఫలితాలు వారికి వ్యతిరేకంగా రావడం..న్యూజిలాండ్ టీమ్‌ వెనకబడిపోవడానికి కారణమైంది. చివరి మ్యాచ్‌లో కూడా గెలుపు ముందు వరకు వచ్చి చతికిలబడింది. ఒకదాని వెంట ఒకటి పరాజయాలు వెంటాడుతున్నా కూడా న్యూజిలాండ్‌లో ఎటువంటి నైరాశ్యం కనిపించడం లేదు.

గేమ్ స్పిరిట్ ఆ దేశ ఆటగాళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్క కివీస్ ఆటగాడు కూడా ఇంతవరకూ భారత్‌కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వలేదు. జెడ్ స్పీడ్‌తో బంతులు విసురుతామని, టన్నుల కొద్ది పరుగులు సాధిస్తామని గొప్పలు పోలేదు. మ్యాచ్ ఓడిపోయిన ప్రతిసారి కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ మాట్లాడుతూ ..భారత జట్టు ఒత్తిడిలో అద్భుతంగా ఆడుతోందని, వారిని చూసి చాలా నేర్చుకోవాలని చెప్పుకొచ్చాడు. క్రికెట్‌ను అత్యంత అభిమానించే దేశం భారత్. ఈ మధ్యకాలంలో మనవాళ్లు భారత్ టీంతో పాటు న్యూజిలాండ్ జట్టును కూడా సపోర్ట్ చేస్తున్నారు. దానికి వాళ్ల వ్యక్తిత్వం, నడవడికే కారణం. అందుకే భారత్ వైట్ వాష్ చేసినా కూడా..’మీరు మ్యాచులను మాత్రమే ఓడిపోయారు..మా మనసులు గెలిచారు’ అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు మన నెటిజన్లు.

Published On - 5:01 pm, Sun, 2 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu