WhatsApp: యూజర్ల ప్రైవసీ కోసం మరో ముందడుగు వేసిన వాట్సాప్… అందుబాటులోకి రానున్న సరికొత్త ఫీచర్..

New Security Features In WhatsApp: కొత్తేడాది ప్రారంభంలో వాట్సాప్ ప్రకటించిన కొత్త ప్రైవసీ పాలసీపై ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాట్సాప్ తీసుకురానున్న కొత్త ప్రైవసీ పాలసీ యూజర్ల వ్యక్తిగత భద్రతను..

WhatsApp: యూజర్ల ప్రైవసీ కోసం మరో ముందడుగు వేసిన వాట్సాప్... అందుబాటులోకి రానున్న సరికొత్త ఫీచర్..
Follow us

|

Updated on: Jan 28, 2021 | 5:00 PM

New Security Features In WhatsApp: కొత్తేడాది ప్రారంభంలో వాట్సాప్ ప్రకటించిన కొత్త ప్రైవసీ పాలసీపై ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాట్సాప్ తీసుకురానున్న కొత్త ప్రైవసీ పాలసీ యూజర్ల వ్యక్తిగత భద్రతను ప్రశ్నార్థకంగా మార్చేస్తోందంటూ పెద్ద ఎత్తున వాదనలు వినిపించాయి. ఈ క్రమంలోనే చాలా మంది వాట్సాప్ అన్ ఇన్‌స్టాల్ కూడా చేశారు. దీంతో ఈ విషయమంపై ఏకంగా వాట్సాప్ దిగొచ్చి ఈ సమస్యకు చెక్ పెట్టింది. నేరుగా యూజర్లకు స్టేటస్‌ల రూపంలో ప్రైవసీ పాలసీలో ఎలాంటి మార్పులు చేయట్లేదని తేల్చి చెప్పింది.

ఇదిలా ఉంటే తాజాగా తమ యూజర్ల వ్యక్తిగత భద్రత విషయంలో వాట్సాప్ మరో ముందడుగు వేసింది. ఇందులో భాగంగానే మరో కొత్త ఫీచర్ తీసుకురాబోతుంది. సాధారణంగా డెస్క్‌టాప్‌లో మనం వాట్సాప్ లాగిన్ కావాలంటే నేరుగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సరిపోయేది. కానీ ఇకపై మాత్రం.. వాట్సాప్ యూజర్లు తమ ఖాతాలను కంప్యూటర్‌కు లింక్ చేసే ముందు, ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ ఐడిని ఉపయోగించాల్సి ఉంటుంది. దీంతో ఈ ఫీచర్ ద్వారా మీ వాట్సాప్ ఖాతాలను ఇతరుల కంప్యూటర్‌కు లింక్ చేయకుండా అడ్డుపడుతుంది. ఈ ఫీచర్ వల్ల ఇకపై డెస్క్‌టాప్‌లో లాగిన్ అయ్యే సమయంలో.. ఫోన్‌లో ఫేస్ ఐడి లేదా ఫింగర్ ప్రింట్ ద్వారా అన్‌లాక్ చేయమని కోరుతుంది. ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్ ఇంకా అభివృద్ది దశలో ఉందని, త్వరలోనే అందరికీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నామని వాట్సాప్ ప్రతినిధులు తెలిపారు.

Also Read: Facebook: కీలక నిర్ణయం తీసుకున్న ఫేస్‌బుక్ యాజమాన్యం… ఇకపై అలాంటి వాటిని సిఫారసు చేయమంటూ ప్రకటన..