రైల్వే శాఖ కొత్త రూల్.. 5 నిముషాలు దాటితే భారీ ఫైన్!

రైల్వే స్టేషన్లలో పార్కింగ్ అనేది పెద్ద సమస్యగా మారింది. వాహనదారులు పార్కింగ్ ప్లేస్‌లో పెట్టకుండా.. ఖాళీ దొరికితే చాలు ఎక్కడపడితే అక్కడ కార్లను పార్క్ చేస్తుంటారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అటు భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అవుతోంది. దీన్ని చెక్ పెట్టేందుకు రైల్వే అధికారులు సరికొత్త రూల్‌ను అమలు చేయనున్నారు. ఒకవేళ ఆ రూల్‌ను అతిక్రమిస్తే.. వాహనదారుల జేబులు ఖాళీ కావాల్సిందే. రైల్వేస్టేషన్‌కు వెళ్లే వారు కారును పార్కింగ్‌లో కాకుండా ఏ ఇతర […]

రైల్వే శాఖ కొత్త రూల్.. 5 నిముషాలు దాటితే భారీ ఫైన్!
Follow us

|

Updated on: Sep 15, 2019 | 2:28 PM

రైల్వే స్టేషన్లలో పార్కింగ్ అనేది పెద్ద సమస్యగా మారింది. వాహనదారులు పార్కింగ్ ప్లేస్‌లో పెట్టకుండా.. ఖాళీ దొరికితే చాలు ఎక్కడపడితే అక్కడ కార్లను పార్క్ చేస్తుంటారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అటు భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అవుతోంది. దీన్ని చెక్ పెట్టేందుకు రైల్వే అధికారులు సరికొత్త రూల్‌ను అమలు చేయనున్నారు. ఒకవేళ ఆ రూల్‌ను అతిక్రమిస్తే.. వాహనదారుల జేబులు ఖాళీ కావాల్సిందే. రైల్వేస్టేషన్‌కు వెళ్లే వారు కారును పార్కింగ్‌లో కాకుండా ఏ ఇతర స్థలంలోనైనా పార్క్ చేస్తే.. ఐదు నిమిషాల్లో తమ వాహనాన్ని తీసేయాలి. అలా కాదని ఐదు నిముషాలు దాటితే ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఒక్కో నిమిషాన్ని క్యాలికులెట్ చేస్తూ ఆలస్యాన్ని బట్టి రూ.100 నుంచి రూ.1000 వరకు జరిమానా విధించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.

ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన స్టేషన్లలో దశలవారీగా ఈ రూల్‌ను అమలు చేయనున్నారు. త్వరలో సికింద్రాబాద్ స్టేషన్‌లో ఈ రూల్ అమలులోకి రానుంది. స్టేషన్ లోపలికి వచ్చే వాహనాలను గుర్తించేందుకు సికింద్రాబాద్ స్టేషన్ లో సీసీ కెమెరాలతో పాటు ఓ ప్రత్యేక బూత్ ఏర్పాటు చేశారు. స్టేషన్ కు వచ్చే ప్రతి వాహనం వివరాలను నమోదు చేస్తారు. వచ్చిన సమయాన్ని తెలిపే రిసిప్ట్‌ను ఇస్తూ.. తిరుగు ప్రయాణంలో ఆ రిసిప్ట్‌ను బూత్‌లో ఇవ్వాలని వాహనదారుడికి చెబుతారు. 5 నిమిషాలు దాటితే సమయాన్ని బట్టి ఫైన్ వేస్తారు. ఒక వేళ రసీదు పోయినా రూ.500 కట్టాల్సిందే.

పార్కింగ్ స్థలంలో కాకుండా ఇతర ప్లేస్‌లలో వాహనాలను నిలిపి ఉంచడంతో ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడుతున్నాయని.. వాటిని నియంత్రించాలంటే భారీ జరిమానాలు వెయ్యక తప్పదని రైల్వే అధికారులు వెల్లడించారు. అప్పుడే జనాలు స్ట్రిక్ట్‌గా రూల్స్ ఫాలో అవుతారన్నారు. అయితే వాహనదారులు మాత్రం ఈ రూల్‌పై సీరియస్ అయ్యారు. సామాన్యులను దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని మండిపడుతున్నారు. అవసరమైన సౌకర్యాలను పట్టించుకోకుండా అనవసరమైన వాటిని ఫైన్లను వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వెబ్ సిరీస్ ఒంటరిగా చూడాలంటే చాలా ధైర్యం కావాలి..
ఈ వెబ్ సిరీస్ ఒంటరిగా చూడాలంటే చాలా ధైర్యం కావాలి..
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
549 పరుగులు, 81 బౌండరీలు.. మరోసారి రికార్డులు బద్దలవ్వాల్సిందే
549 పరుగులు, 81 బౌండరీలు.. మరోసారి రికార్డులు బద్దలవ్వాల్సిందే
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
చిన్నారి మహాలక్ష్మి ఎవరో గుర్తుపట్టగలరా ?..
చిన్నారి మహాలక్ష్మి ఎవరో గుర్తుపట్టగలరా ?..
తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్