మొబైల్ యాప్ తో కరోనా ట్రేసింగ్.. ఏపీలో కొత్త ఐడియా

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి వీలైన అన్ని మార్గాలను అన్వేషిస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు. తాజాగా కరోనా కట్టడికి ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఏకంగా ప్రత్యేక మొబైల్ యాప్ ను సిద్ధం చేసింది.

మొబైల్ యాప్ తో కరోనా ట్రేసింగ్.. ఏపీలో కొత్త ఐడియా
Follow us

|

Updated on: Apr 26, 2020 | 6:27 PM

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి వీలైన అన్ని మార్గాలను అన్వేషిస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు. తాజాగా కరోనా కట్టడికి ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఏకంగా ప్రత్యేక మొబైల్ యాప్ ను సిద్ధం చేసింది. ఈ మొబైల్ యాప్ ద్వారా మెడికల్ షాపుల నుంచి ఏ రకమైన మెడిసిన్ కొంటున్నారు అనే విషయంలో ఫోకస్ చేస్తుంది.

మెడికల్ షాపుల కోసం ప్రత్యేక ఫార్మసీ యాప్ ను సిద్దం చేసింది ఏపీ వైద్య ఆరోగ్య శాఖ. ఈ ఫార్మసీ యాప్ కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేస్తుందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఫార్మసీ యాప్ ను రాష్ట్రంలోని మెడికల్ షాపుల యజమానులు అందరూ తమ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత తమ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాలని వారు సూచిస్తున్నారు.

జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలతో మెడికల్ షాపులకొచ్చే వారి వివరాల్ని ఈ యాప్లో పొందుపర్చాలని మెడికల్ షాపుల ఓనర్ లకు అధికారులు సూచించారు. ఈ రకంగా దగ్గు, జ్వరం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు ఉన్న వారిని గుర్తించి వారి వద్దకు స్థానిక ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ వచ్చి స్వయంగా చికిత్స అందిస్తారు.

ఇప్పటి వరకు ఎవరైనా కరోనా వైరస్ పరీక్షలు జరిపించుకోకుండా వెనుకడుగు వేస్తున్న వారు, తప్పించుకు తిరుగుతున్న వారు ఈ సరికొత్త మొబైల్ యాప్ ద్వారా వెలుగులోకి వస్తారని వైద్యాధికారులు భావిస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి Covid 19 AP Pharma యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. కొవిడ్ పై పోరాటంలో మెడికల్ షాపుల యజమానులు ప్రభుత్వానికి సహకరించాలని అధికారులు కోరుతున్నారు.