ఇంటర్‌లో పాస్, ఫెయిల్ విధానానికిక స్వస్తి..?

ఈ పోటీ ప్రపంచంలో తమ పిల్లలు కూడా ఎల్లప్పుడూ ఫస్ట్ ఉండాలనుకునే తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. ఆ క్రమంలోనే విద్యార్థుల మీద ర్యా‌ంకుల ప్రభావంతో పాటు ఒత్తిడి కూడా అధికంగా ఉంటోంది. ఉత్తీర్ణత సాధిస్తే పర్వాలేదు గానీ.. ఫెయిల్ అయితే మాత్రం.. స్టూడెంట్స్ జీవితంలోనే ఓడిపోయామనే భావనతో కృంగిపోయి.. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే.. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో చోటు చేసుకున్న అవకతవకల మధ్య ఎందరో విద్యార్థులు బలైపోయారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఇంటర్ […]

ఇంటర్‌లో పాస్, ఫెయిల్ విధానానికిక స్వస్తి..?
Follow us

| Edited By:

Updated on: Dec 03, 2019 | 4:18 PM

ఈ పోటీ ప్రపంచంలో తమ పిల్లలు కూడా ఎల్లప్పుడూ ఫస్ట్ ఉండాలనుకునే తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. ఆ క్రమంలోనే విద్యార్థుల మీద ర్యా‌ంకుల ప్రభావంతో పాటు ఒత్తిడి కూడా అధికంగా ఉంటోంది. ఉత్తీర్ణత సాధిస్తే పర్వాలేదు గానీ.. ఫెయిల్ అయితే మాత్రం.. స్టూడెంట్స్ జీవితంలోనే ఓడిపోయామనే భావనతో కృంగిపోయి.. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే.. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో చోటు చేసుకున్న అవకతవకల మధ్య ఎందరో విద్యార్థులు బలైపోయారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఇంటర్ బోర్డు కొత్త విధానానికి శ్రీకారం చుట్టాలని భావిస్తోంది. మరోవైపు విద్యా విధానంలో కూడా పలు మార్పులు చేయాలని అధికారులు కసరత్తులు చేస్తున్నారట.

మొదటగా ఇంటర్ మార్కుల పత్రాలపై ఇప్పటివరకు ఉన్న ఉత్తీర్ణత (పాస్‌), అనుత్తీర్ణత (ఫెయిల్‌) అనే ముద్రణలకు స్వస్తి పలికి.. వాటికి బదులుగా క్లియర్, అన్ క్లియర్ అని ముద్రించాలని తెలంగాణ ఇంటర్ బోర్డు యోచిస్తోందని తెలుస్తోంది. అంతేకాకుండా విదేశాల్లో మాదిరిగా ‘ఫ్లెక్సీ కోర్సు’ విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ‘ఫ్లెక్సీ కోర్సు’ అంటే.. ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసిన తర్వాత.. ఏదైనా చదువుకుని.. రెండు, మూడేళ్ళ వ్యవధిలో రెండో సంవత్సరం పూర్తి చేసుకోవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలను బోర్డు రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇలాంటి విధానం ఒడిశాలోని కొన్ని కాలేజీలలో అమలు అవుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఈ రూల్ వస్తే.. ఇంటర్ విద్యలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. విద్యార్థులకు కూడా ఈ విధానం ఎంతో వెసులుబాటుగా ఉంటుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.
సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.
అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..