Bitcoin : రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతున్న బిట్ కాయిన్.. ప్రజంట్ ధర చెబితే దిమ్మతిరుగుద్ది

బిట్ కాయిన్ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అంతకంతకూ తన విలువ పెంచుకంటూ ముందుకు సాగుతోంది. తాజాగా బిట్ కాయిన్ విలువ 25,000 డాలర్లకు చేరుకుంది. మేరి బిట్ మాస్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పోస్టులు  పెడుతున్నారు నెటిజన్లు. 

Bitcoin : రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతున్న బిట్ కాయిన్.. ప్రజంట్ ధర చెబితే దిమ్మతిరుగుద్ది
Follow us

|

Updated on: Dec 26, 2020 | 4:14 PM

బిట్ కాయిన్ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అంతకంతకూ తన విలువ పెంచుకంటూ ముందుకు సాగుతోంది. తాజాగా బిట్ కాయిన్ విలువ 25,000 డాలర్లకు చేరుకుంది. మేరి బిట్ మాస్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు.  ఒక్క వారంలోనే బిట్ కాయిన్ ధర 3.15 శాతం పెరిగింది.  ప్రస్తుతం బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్ 350 బిలియన్ డాలర్లుగా ఉంది. అదే బంగారం మార్కెట్ క్యాప్ 10 ట్రిలియన్ డాలర్లు మాత్రమే.  ఇన్వెస్టర్ల పోర్ట్ ఫోలియోల్లో ప్రస్తుతం బిట్ కాయిన్ భాగమైంది.  రిటర్న్స్ బాగా ఇస్తుండటంతో బిట్ కాయిన్ కొనేందుకు ప్రజలు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. బ్లాక్ చైయిన్ డాట్ కామ్ వెబ్‌సైట్ లెక్కల ప్రకారం…క్రిప్టో ఎక్స్‌ఛేంజ్‌లో సరిగ్గా ఏడాదిలో 40.46% రిటర్న్స్ ఇచ్చింది బిట్ కాయిన్. 2019 డిసెంబర్ నుంచి 1.8 కోట్ల కొత్త వ్యాలెట్లు క్రియేట్ చేసుకుంటూ దూసుకెళ్లింది.

బిట్‌కాయిన్ ధర చరిత్ర చూస్తే …

2019లో బిట్ కాయిన్ ధర 7,000 డాలర్లు 2020 సెప్టెంబర్ లో బిట్‌కాయిన్ ధర 10,000 డాలర్లు 2020 అక్టోబర్ లో బిట్ కాయిన్ ధర 13,000 డాలర్లు 2020 నవంబర్ లో 17,000 డాలర్లు 2020 డిసెంబర్ 26 నాటికి 25,000 డాలర్లు

బిట్ కాయిన్ ర్యాలీ ఎక్కడ ఆగుతుందో అంచనా వేయడం కష్టమేనన్న చర్చ జరుగుతోంది.  చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా  బిట్ కాయిన్ ర్యాలీ కొనసాగుతుంది. రోజురోజుకు ధర రాకెట్‌లా దూసుకెళ్తుంది. ఇండియాలో ఒక బిట్ కాయిన్ కొనాలంటే రూ.18,41,597 చెల్లించాలి.  12 ఏళ్ల కిందట మొదలైన ఈ బిట్ కాయిన్ ను క్రిప్టోకరెన్సీ లేదా వర్చువల్ కరెన్సీగా అనే పేరుతో కూడా పిలుస్తారు.

Also Read : 

Raja singh VS Silpa Chakrapani: ‘ఎనీ టైమ్ నేను రెడీ..రాజీనామాకు నువ్వు రెడీనా’..రాజాసింగ్‏కు శిల్పా చక్రపాణి సవాల్

Tirumala News : వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఏడు కొండలవాడికి భారీ ఆదాయం..లాక్ డౌన్ తర్వాత ఇదే అత్యధికం

Andhrapradesh: ఆర్థిక వివాదాల పరిష్కారానికి ఏపీలో ప్రత్యేక కోర్టులు..ఆన్‌లైన్‌ ద‌్వారానే ఫిర్యాదులు..ఆరు నెలల్లో పరిష్కారం