తెలంగాణలో కొత్త వైరస్ స్ట్రెయిన్ కలవరం.. అప్రమత్తమైన అధికారులు.. వైరస్ వ్యాప్తిపై ఉన్నతస్థాయి సమీక్ష

కరోనావైరస్ కొత్త స్ట్రెయిన్ ఇప్పుడు తెలంగాణ వైద్యశాఖ అధికారులను టెన్షన్ పెడుతోంది.. యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన..

తెలంగాణలో కొత్త వైరస్ స్ట్రెయిన్ కలవరం.. అప్రమత్తమైన అధికారులు.. వైరస్ వ్యాప్తిపై ఉన్నతస్థాయి సమీక్ష
Follow us

|

Updated on: Dec 29, 2020 | 6:45 AM

కరోనావైరస్ కొత్త స్ట్రెయిన్ ఇప్పుడు తెలంగాణ వైద్యశాఖ అధికారులను టెన్షన్ పెడుతోంది.. యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రయాణికుల్లో ఇప్పటికే 20 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా.. అసలు అది పాత వైరసేనా? కొత్త స్ట్రెయినా? అనే విషయం తేల్చడం కోసం సీసీఎంబీకి శాంపిల్స్ పంపించారు అధికారులు.. దీనిపై జీనోమ్ చేసిన సీసీఎంబీ శాస్త్రవేత్తలు… ఆ నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి అందజేశారు. దీంతో అధికారుల్లో కొత్త టెన్షన్ మొదలైనట్టు తెలుస్తోంది. సీసీఎంబీ రిపోర్ట్‌లో కరోనా స్ట్రెయిన్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సీసీఎంబీ నివేదికపై చర్చించేందుకు అత్యవసరంగా సమావేశమయ్యారు వైద్యశాఖ ఉన్నతాధికారులు. సీసీఎంబీ రిపోర్టులను పరిశీలించేందుకు కోసం మరో ల్యాబ్‌కు కూడా పంపించారు. సీసీఎంబీ రిపోర్టుల ప్రకారం అసలు కొత్త స్ట్రెయిన్ ఉందా? లేదా? అనేదానిపై సమావేశంలో కీలకంగా చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కూడా హాజరుకానున్నారు. మరోవైపు అప్రమత్తమైన ప్రభుత్వం… తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఫోకస్ పెట్టింది.. బీఆర్‌కే భవన్‌లో జరిగే తెలంగాణ వైద్యాధికారుల, మంత్రి ఈటల సమావేశానికి సీసీఎంబీ శాస్త్రవేత్తలు కూడా హాజరవుతారని చెబుతున్నారు. రిపోర్ట్ లో కరోనా స్ట్రెయిన్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతుండగా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవగాహన పై సమీక్షించనున్నారు మంత్రి ఈటల.. మరోవైపు.. సీసీఎంబీ రిపోర్ట్‌ను ఢిల్లీకి పంపించారు తెలంగాణ వైద్య శాఖ అధికారులు.. ఇవాళ సాయంత్రం సెకండ్ స్ట్రెయిన్ మీద కేంద్ర వైద్య శాఖ ప్రెస్ మీట్ పెట్టి.. ఓ ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తంగాన కరోనావైరస్ కొత్త స్ట్రెయిన్ ఇప్పుడు తెలంగాణలో కలకలం సృష్టిస్తోంది.