సాగర తీరానికి కొత్త సొబగులు..ఇక రాత్రంతా..!

హైదరాబాద్ హుస్సేన్ సాగర తీరంలో కొత్త ప్రాజెక్టులు రాబోతున్నాయి. ఈ దిశగా పురపాలక మంత్రిత్వ శాఖ చర్యలు ప్రారంభించింది. చార్మినార్ సమీపంలో ఏర్పాటు చేసినట్లుగా హుస్సేన్ సాగర్ తీరంలోను...

  • Rajesh Sharma
  • Publish Date - 4:56 pm, Wed, 4 November 20
సాగర తీరానికి కొత్త సొబగులు..ఇక రాత్రంతా..!

New attractions at Hussainsagar: ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి.. ప్రస్తుతం వెలవెలబోతున్నట్లు కనిపిస్తున్న హుస్సేన్ సాగర్ తీరానికి కొత్త సొబగులు అద్దాలని తలపెట్టింది తెలంగాణ మునిసిపల్ శాఖ. హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు ప్రాధాన్యతనిస్తున్న పురపాలక శాఖ.. సాగర తీరంలో నైట్ బజార్‌ను ప్రారంభించాలని తీర్మానించింది. సాగర తీరంలో ఎంజాయ్ చేయడం మాత్రమే కాకుండా షాపింగ్‌తో సంతోషంగా గడిపే ఏర్పాట్లు చేస్తోంది.

హైదరాబాద్ అనగానే టక్కున గుర్తొచ్చే ప్రదేశాలు హుస్సేన్ సాగర్, చార్మినార్. ఇక్కడ టూరిస్టుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా రాత్రిపూట వీటిని ఆస్వాదించడానికి నగరవాసులు, దేశీయ పర్యాటకులే కాకుండా విదేశీయులు కూడా వస్తూ ఉంటారు. చార్మినార్ దగ్గర రాత్రి పూట సందడి చెప్పనక్కర్లేదు. చార్మినార్ చుట్టూ తిరుగుతూ… అక్కడి వీధుల్లో సందడి చేస్తూ ఉంటారు జనం. ఇప్పుడు హుస్సేన్ సాగర్ దగ్గర అలాంటి సందడే ఏర్పడే విధంగా ఏర్పాట్లు చేస్తోంది పురపాలక శాఖ. సాగర్‌కు వచ్చేవాళ్లు రాత్రిపూట షాపింగ్ చేసే విధంగా నైట్ బజార్‌ను ఏర్పాటు చేయబోతోంది. అర్ధరాత్రి 12 వరకు ఈ నైట్ బజారును తెరిచే వుంచేలా ఏర్పాట్లు చేస్తోంది.

బుద్ధ భవన్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు తీరంలో నైట్ బజార్ ను అభివృద్ధి చేయనున్నారు. సుమారు 13 వందల మీటర్ల విస్తీర్ణాన్ని హైదరాబాద్ ప్రజలకు నైట్ బజార్ రూపంలో అందుబాటులోకి ఉంచనున్నారు. పదిహేను కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు టెండర్లను ఆహ్వానించారు. చార్మినార్ సమీపంలోని చూడి బజార్ తరహాలో నైట్ బజార్ ఏర్పాటు చేయబోతున్నారు అధికారులు. సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్, నీటి నాణ్యతలను కాపాడుతూ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఎఫ్.ఆర్.డీ. ప్లాంటర్ బాక్సులను పర్యావరణానికి అనుకూలంగా ఉంచుతూ ఈ నైట్ బజార్ ఏర్పాటు కాబోతోంది.

దాదాపు 150 నుంచి 200 దుకాణాలు ఇక్కడ ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. గార్మెంట్స్, ఇయర్,రింగ్స్, జుంకీలు, గాజులు, వెడ్డింగ్ మెటీరియల్స్ వంటి దుకాణాలను ఏర్పాటు చేయబోతున్నారు. సాగర్ అందాన్ని ఎంజాయ్ చేసే విధంగా ఫుడ్ కోర్ట్, లైటింగ్, సెట్టింగ్ ప్లేసెస్, వుడ్ ప్లాస్టిక్ కంపోసిట్ డెక్ ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతం సెంటర్ దశలో ఉన్న PPP (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్) ప్రాజెక్టు పట్ల ఆసక్తి కనబరిచిన ఏజెన్సీకి ముందు పది సంవత్సరాల పాటు బాధ్యత అప్పగించే అవకాశం ఉంది. దాన్ని బట్టి ఆ తర్వాత ఐదు సంవత్సరాలకు సంబంధించి ఏజెన్సీకి లైసెన్సు గడువు పెంచే అవకాశం వుందని అధికారులు తెలిపారు.

ALSO READ: ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్.. కేసుల్లో మరింత తీవ్రత

ALSO READ: సిట్టింగ్ లీడర్ల కేసులపై వున్న కేసులకే తొలి ప్రాధాన్యం

ALSO READ: స్కూళ్ళ రీఓపెనింగ్‌పై తమిళ సర్కార్ వెనుకంజ

ALSO READ: వరాహస్వామి ఆలయానికి బంగారు తాపడం

ALSO READ: విజయవంతంగా ‘పినాక’ ప్రయోగం

ALSO READ: రెండు రాష్ట్రాల్లో మళ్ళీ భారీ వర్షాలు