‘ఆ భూభాగాలు మావే’.. నేపాల్ ప్రధాని శర్మ ఓలి

తమ దేశ సరిహద్దుల్లోని  లింపియాధుర, లిపు లేఖ్, కాలాపానీ భూభాగాలు తమవేనని నేపాల్ ప్రధాని కె.పి. శర్మ ఓలి ప్రకటించారు. వివాదాస్పదమైన ఈ భూభాగాలను ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన పొలిటికల్ మ్యాప్ లో చూపిన సంగతి విదితమే. వీటిని తిరిగి తమ దేశ పరిధిలోకి తెచ్చేందుకు భారత ప్రభుత్వంతో దౌత్య పరమైన యత్నాలు చేస్తామని ఆయన నేపాల్ పార్లమెంటుకు తెలిపారు. ఈ సమస్యను నీరు గార్చనివ్వబోమని, డిప్లొమాటిక్ చర్చల ద్వారా పరిష్కరిస్తామని ఆయన వెల్లడించారు. వివాదాస్పదమైన […]

'ఆ భూభాగాలు మావే'.. నేపాల్ ప్రధాని శర్మ ఓలి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 20, 2020 | 12:43 PM

తమ దేశ సరిహద్దుల్లోని  లింపియాధుర, లిపు లేఖ్, కాలాపానీ భూభాగాలు తమవేనని నేపాల్ ప్రధాని కె.పి. శర్మ ఓలి ప్రకటించారు. వివాదాస్పదమైన ఈ భూభాగాలను ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన పొలిటికల్ మ్యాప్ లో చూపిన సంగతి విదితమే. వీటిని తిరిగి తమ దేశ పరిధిలోకి తెచ్చేందుకు భారత ప్రభుత్వంతో దౌత్య పరమైన యత్నాలు చేస్తామని ఆయన నేపాల్ పార్లమెంటుకు తెలిపారు. ఈ సమస్యను నీరు గార్చనివ్వబోమని, డిప్లొమాటిక్ చర్చల ద్వారా పరిష్కరిస్తామని ఆయన వెల్లడించారు. వివాదాస్పదమైన ఈ మూడు భూభాగాలను తమ దేశ పొలిటికల్ మ్యాప్ లో చేరుస్తూ నేపాల్ కేబినెట్ దీనికి ఆమోద ముద్ర వేసింది. కొత్తగా విడుదల చేసిన మ్యాప్ ను ఎడాప్ట్ చేసుకునేందుకు రాజ్యాంగాన్ని సవరిస్తామని శర్మ ఓలి చెప్పారు. భారత-నేపాల్ దేశాలు ఓపెన్ బోర్డర్ లో 1800 కిలోమీటర్ల భూభాగాన్ని షేర్ చేసుకుంటున్నాయి. 1816 లో భారత పశ్చిమ సరిహద్దులను నోటిఫై చేసేందుకు బ్రిటిష్ పాలకులతో సుగౌలీ కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ అగ్రిమెంట్ ప్రకారం లిపు లేఖ్ కనుమ నేపాల్ దే అన్నారు. 1962 లో చైనాతో యుధ్ధం జరిగినప్పటి నుంచి భారత దళాలు లింపియాదుర, కాలాపానీ ప్రాంతాల్లో మోహరించి ఉన్నాయి.

లిపులేఖ్ కనుమను ఉత్తరాఖండ్ లోని కైలాస్ మానస సరోవర్ రూటుకి కనెక్ట్ చేస్తున్న రోడ్డును రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ నెల 8 న ప్రారంభించారు. అయితే ఇందుకు నేపాల్ ప్రభుత్వం నిరసన తెలిపింది. ఆ ప్రాంతంలో సెక్యూరిటీ పోస్టును ఏర్పాటు చేయాలనీ సంకల్పించింది. ఇక ఉత్తరాఖండ్ లోని పిటోరాగఢ్ జిల్లా ద్వారా వెళ్లే రోడ్డు భారత భూభాగంలోనిదేనని మన హోమ్ శాఖ చెబుతోంది.