6 రాష్ట్రాల నుంచి వచ్చే రైల్వే ప్రయాణికులకు మహారాష్ట్ర కోవిడ్ గైడ్ లైన్స్., లేని పక్షంలో..

6 రాష్ట్రాల నుంచి వచ్చే రైల్వే ప్రయాణికులకు మహారాష్ట్ర కోవిడ్ గైడ్ లైన్స్., లేని పక్షంలో..
Negative Rt Pcr Report Must For People

కేరళ, గోవా, రాజస్తాన్, గుజరాత్, ఢిల్లీ, ఉత్తరాఖండ్  రాష్ట్రాల నుంచి తమ రాష్ట్రానికి  వచ్చే రైల్వే ప్రయాణికులు తప్పనిసరిగా నెగెటివ్ పీసీఆర్-టెస్ట్ రిపోర్టును సమర్పించాల్సి ఉంటుందని, ఇది 48 గంటల ముందు తీసుకుని ఉండాలని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Umakanth Rao

| Edited By: Phani CH

Apr 19, 2021 | 11:45 AM

కేరళ, గోవా, రాజస్తాన్, గుజరాత్, ఢిల్లీ, ఉత్తరాఖండ్  రాష్ట్రాల నుంచి తమ రాష్ట్రానికి  వచ్చే రైల్వే ప్రయాణికులు తప్పనిసరిగా నెగెటివ్ పీసీఆర్-టెస్ట్ రిపోర్టును సమర్పించాల్సి ఉంటుందని, ఇది 48 గంటల ముందు తీసుకుని ఉండాలని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ 6 రాష్ట్రాలను ‘ప్లేసెస్ ఆఫ్ సెన్సిటివ్ ఓరిజన్’ గా ప్రభుత్వం పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు తాము ఈ చర్య తీసుకుంటున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించనున్నారు. రైల్వే ప్లాట్ ఫారాలలో అన్ని ఎగ్జిట్ పాయింట్ల వద్ద థర్మల్ స్కానర్లను ఏర్పాటు చేయాలనీ రైల్వే శాఖను ప్రభుత్వం కోరింది. ప్రయాణికుల డేటాను స్థానిక డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ ప్రతి రోజూ షేర్ చేసుకోనుంది. ఈ ఆరు రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్లలో రిజర్వ్ చేయని టికెట్ తో రాగోరే ప్రయాణికులను అనుమతించబోమని కూడా మహారాష్ట్ర అధికారులు తెలిపారు.

ఏ ప్రయాణికుడైనా ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ రిపోర్టును సమర్పించని పక్షంలో.. అతనికి రైల్వే స్టేషన్ లోనే రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ నిర్వహిస్తారు. దేశంలో ముఖ్యంగా మహారాష్ట్రలో కోవిడ్ కేసులు తామరతంపరగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ విధమైన పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Mewalal Choudhary: కరోనా కాటుకు మరో ప్రజా ప్రతినిధి బలి.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే చౌదరి మృతి

Karthika Deepam: కార్తీక్ నిజంగా మారాడా.. లేక జాలిపడుతున్నాడా అని ఆలోచిస్తున్న సౌందర్య.. మోనిత శనిలా పట్టుకుందన్న భాగ్యం

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu